Movie News

శర్వానంద్ సినిమా ఓటీటీకి?

ఎక్స్‌ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి చిత్రాలతో ఒక టైంలో మాంచి ఊపుమీద కనిపించాడు యువ కథానాయకుడు శర్వానంద్. కానీ ఆ తర్వాత అతడి కెరీర్ గాడి తప్పింది. గత ఐదేళ్లలో ఒక్క ‘మహానుభావుడు’ మినహా శర్వాకు ఒక్క సక్సెస్ కూడా లేదు. ‘శ్రీకారం’ లాంటి మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం అతడికి నిరాశనే మిగిల్చాయి. ఇటీవలే ‘మహాసముద్రం’తో మరో చేదు ఫలితాన్ని అందుకున్నాడు శర్వా.

ఇప్పుడిక తన చేతిలో ఉన్న రెండు క్లాస్ చిత్రాల మీదే అతడి ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. అందులో ఒకటి ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ కాగా.. ఇంకోటి ‘ఒకే ఒక జీవితం’. వీటిలో మొదటి చిత్రాన్ని ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల రూపొందిస్తున్నాడు. షూటింగ్ మధ్య దశలో ఉంది. ‘ఒకే ఒక జీవితం’ విషయానికి వస్తే ఇది తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో అందరినీ ఆకట్టుకున్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఐతే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోదన్నది కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం. వరుస ఫ్లాపుల కారణంగా శర్వా మార్కెట్ బాగా దెబ్బ తినేయడంతో థియేట్రికల్ రిలీజ్ మీద నిర్మాత ఎస్.ఆర్.ప్రభు అంతగా ఆసక్తి చూపించట్లేదట.

‘జర్నీ’ మూవీతో ఒకప్పుడు తమిళంలో శర్వాకు మంచి గుర్తింపే లభించింది. తర్వాత తమిళంలో మరో చిత్రం చేసిన శర్వా.. ఆపై చాలా ఏళ్లు కోలీవుడ్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి తమిళంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసినా అంత మంచి ఫలితం వచ్చే అవకాశం లేదు. తెలుగులోనూ శర్వా పరిస్థితి ఆశాజనకంగా లేదు. అమేజాన్ ప్రైమ్ వాళ్లు మంచి లాభానికి సినిమాను కొంటుండటంతో నిర్మాత ప్రభు ఆ డీల్‌ను పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నాడట. త్వరలోనే ‘ఒకే ఒక జీవితం’ డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.

This post was last modified on November 20, 2021 12:11 am

Share

Recent Posts

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

6 minutes ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

1 hour ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

2 hours ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

2 hours ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

2 hours ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

3 hours ago