అల్లు అర్జున్ మూణ్నాలుగేళ్ల ముందే చేయాల్సిన సినిమా ‘ఐకాన్’. అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కాల్సింది. దీని గురించి అప్పట్లో ఘనంగా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. బన్నీ ఐకాన్ అని రాసి ఉన్న క్యాప్ పెట్టుకుని కొంత హడావుడి కూడా చేశాడు కొన్ని రోజులు. తీరా చూస్తే ఈ సినిమా సెట్స్ మీదికే వెళ్లలేదు. మధ్యలో వేణు ‘వకీల్ సాబ్’ సినిమా తీశాడు. ఆ సినిమా మంచి ఫలితాన్నందుకోవడంతో వేణు మీద బన్నీకి గురి కుదిరిందన్నారు. అతి త్వరలో ‘ఐకాన్’ మొదలవుతుందంటూ ప్రకటనలు కూడా వచ్చాయి. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ అయ్యాక బన్నీ చేసే సినిమా ఇదే అన్నారు. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడేమో ఈ సినిమాకు మళ్లీ బ్రేక్ పడ్డట్లు చెబుతున్నారు. బ్రేక్ అంటే తాత్కాలికం కూడా కాదట. పూర్తిగా ఈ సినిమాను ఆపేస్తున్నారట.
తన 21వ సినిమాకు అల్లు అర్జున్.. బోయపాటి శ్రీనుతో జత కట్టబోతున్నట్లు సమాచారం. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘సరైనోడు’ బ్లాక్‌బస్టర్ కావడం తెలిసిందే. ఐతే ఆ తర్వాత శ్రీను ‘జయ జానకి నాయక’ లాంటి ఫ్లాప్, ‘వినయ విధేయ రామ’ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు బాలయ్యతో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి శ్రీనుతో బన్నీ కథా చర్చలు జరుపుతున్న విషయాన్ని బన్నీ వాసు ఇంతకుముందే వెల్లడించాడు. బన్నీ లైనప్ ఏదనే విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నట్లు కూడా చెప్పాడు. ఐతే తన తదుపరి సినిమాను బోయపాటికే చేయడానికి బన్నీ ఫిక్సయ్యాడని.. ‘ఐకాన్’పై ఊగిసలాట లేకుండా ఆ కథను చేయాలనుకోవట్లేదని వేణుకు స్పష్టం చేశాడని అంటున్నారు. ‘సరైనోడు’ను నిర్మించిన గీతా ఆర్ట్స్ బేనర్లోనే కొత్త సినిమా కూడా తెరకెక్కనుందట. అభిమానుల్లోనూ గందరగోళానికి తావు లేకుండా తాను ‘ఐకాన్’ సినిమా చేయట్లేదని బన్నీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
This post was last modified on November 7, 2021 3:45 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…