Movie News

‘బంగార్రాజు’పై నాగ్ ప్లాన్ అదీ..

2022 సంక్రాంతి పందెం కోళ్లపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. నెల ముందు వరకు అయితే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ పండుగ బరిలో ఉంటాయని అనుకున్నారంతా. మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాలతో సందడే సందడిగా ఉంటుందనుకున్నారు. కానీ ఊహించని విధంగా రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది.

ఆ చిత్రాన్ని సరిగ్గా పండక్కి కాకుండా కొంచెం ముందుగా జనవరి 7న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం నిర్ణయించింది. ఇక అప్పట్నుంచి మొదలైంది గందరగోళం. మిగతా మూడు చిత్రాల విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఐతే ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ కావడంతో ఇప్పటికే రెండుమూడుసార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో దాన్ని అనుకున్న ప్రకారమే జనవరి 14న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఇక భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాల సంగతే తేలాల్సి ఉంది.

‘ఆర్ఆర్ఆర్’ ధాటికి మిగతా మూడు భారీ చిత్రాలే భయపడుతుంటే.. నాగార్జున సినిమా ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి రేసులోకి రాబోతోందని కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. ముందు ఇది విన్న వారికి తమాషాగా అనిపించింది. కానీ నాగార్జున మాత్రం ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నాడు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు సంక్రాంతికి మించిన సీజన్ లేదన్నది నాగ్ అభిప్రాయం.

అందులోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి రిలీజై ఇరగాడేసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో దాని ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే తేవాలని ఫిక్సయ్యాడు. ఈ సీజన్ మిస్సయితే.. మంచి టైమింగ్ మిస్సయిపోతుంది.

ఐతే సంక్రాంతి సినిమాల గురించి నాగ్ భయపడాల్సిన పని లేదని.. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వాయిదా పడటం పక్కా అని.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన తమ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ అండ ఉంటుందని.. పైగా పండుగ టైంలో ఆ భారీ చిత్రాల ఓవర్ ఫ్లోస్ కూడా కలిసొస్తాయన్నది నాగ్ ఆలోచన. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట యధావిధిగా వస్తే తప్ప ‘బంగార్రాజు’ సంక్రాంతి ఆగమనం గ్యారెంటీ అన్నమాటే.

This post was last modified on November 1, 2021 3:16 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

1 hour ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

3 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

3 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

3 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

7 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

7 hours ago