గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. ఒకప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కథలను ఆవిష్కరిస్తూ బ్లాక్‌బస్టర్ల మీద బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఆ తర్వాత ఒక మూసలో పడిపోయాడు. ఎంతసేపు ‘మాఫియా’ చుట్టూ కథలను తిప్పి ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేశాడు. ఆయన్నుంచి మరీ ‘రోగ్’ లాంటి నాసిరకం సినిమాలొస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. దానికి ముందు, తర్వాత కూడా పేలవమైన చిత్రాలనే అందించాడు పూరి.
ఐతే చాలా ఏళ్ల తర్వాత లేక లేక ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం పెద్ద హిట్టయిపోయింది. ఐతే ఆ సినిమాలోనూ పూరి దర్శకుడిగా మెప్పించింది తక్కువే. చాలామందికి ఆ సినిమా విజయం ఫ్లూక్ లాగే అనిపించింది. విజయ్ దేవరకొండ ఆ టైంలో పూరీని నమ్మి ‘లైగర్’ ఒప్పుకుంటే తన అభిమానులు కొంచెం ఆందోళన చెందిన మాట వాస్తవం.
విజయ్ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు పూరి మీద ఉంది. అందుకేనేమో పూరి కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా మేకింగ్ టైం తీసుకుంటున్నాడు ‘లైగర్’ కోసం. కేవలం కరోనా మాత్రమే ఈ సినిమా ఆలస్యానికి కారణం కాదు. పాన్ ఇండియా సినిమా కావడం, కరణ్ జోహార్ లాంటి వాడు ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి కావడం పూరి మీద మరింత బాధ్యత పెంచేదే. కానీ మామూలుగా చూస్తే పూరి ఎవరి కోసమో అలెర్ట్ అయి, జాగ్రత్త పడి సినిమా తీసే రకం అయితే కాదు. తనకు ఏమనిపిస్తే అది.. చకచకా తీసి పడేస్తాడు. లేకుంటే కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ లాంటి పేవలమైన సినిమా తీసేవాడు కాదు.
అతడి రెండో చిత్రం ‘రొమాంటిక్’కు కూడా స్క్రిప్టు అందించింది పూరీనే. ఆ సినిమా చూసి పూరి పూర్తిగా ఔట్‌డేట్ అయిపోయాడు, మూసలోంచి బయటికి రాలేకపోతున్నాడనే అభిప్రాయం బలంగా కలిగింది. ఈ సినిమా కథ రాసిన టైంలోనే ‘లైగర్’కు కూడా స్క్రిప్టు రాశాడు పూరి. అలాంటపుడు ఆయన గొప్ప మార్పు చూపించి ఉంటాడా..? ‘లైగర్’తో మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరచలడా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘రొమాంటిక్’ చూశాక ‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం బలపడుతోంది. అదే సమయంలో ‘లైగర్’ మీద భయాలు పెరుగుతున్నాయి. ఈ స్థితిలో ఆ చిత్రంతో హిట్ కొడితే మాత్రం అదొక మిరాకిల్ అవుతుంది.
This post was last modified on November 1, 2021 2:51 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…