ప్ర‌భాస్ ఆమెకు ఫ్యాన్.. అత‌డికి ఆమె ఫ్యాన్

Prabhas

మైనే ప్యార్ కియా సినిమాతో దేశ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కుల‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన క‌థానాయిక‌గా భాగ్య‌శ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాద‌మై ఇక్క‌డా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా రాణాలో న‌టించి మాయ‌మైన భాగ్య‌శ్రీ.. మ‌ళ్లీ ఇటు చూడ‌లేదు. ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమాలో ఆమె అత‌డికి త‌ల్లి పాత్ర పోషిస్తుండ‌టం విశేషం.

హిందీలో కూడా సినిమాలు చేయ‌డం మానేసిన భాగ్య‌శ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో న‌టించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఐతే ప్ర‌భాస్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని.. అత‌డి కోసమే తానీ సినిమాను ఒప్పుకున్నాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది భాగ్య‌శ్రీ. ప్ర‌భాస్‌ను క‌లిశాక అత‌ను త‌న‌కు ఫ్యాన్ అని తెలిసిందని ఆమె చెప్పింది.

ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ప్రేమ పావురాలు హీరోయిన్‌గానే గుర్తుంచుకున్నార‌ని చెప్పిన భాగ్య‌శ్రీ.. ఇన్నేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వ‌నుండ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పింది. ప్ర‌భాస్ న‌ట‌న‌కు పెద్ద అభిమాని కావ‌డం వ‌ల్లే తాను ఈ సినిమా అంగీక‌రించాన‌ని అంది.

ప్ర‌భాస్ ఎంత ఎదిగినా చాలా విన‌యంగా ఉంటాడ‌ని.. తాను తొలి రోజు షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చిన‌పుడు ఎదురొచ్చి ఆహ్వానం ప‌లికాడ‌ని.. త‌న‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్పాడ‌ని భాగ్య‌శ్రీ అంది. తామిద్ద‌రం భోజ‌న ప్రియుల‌మ‌ని.. షూటింగ్ సంద‌ర్భంగా ఎక్కువ‌గా తిండి గురించే మాట్లాడుకునేవాళ్ల‌మ‌ని ఆమె వెల్ల‌డించింది. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.