ఇప్పుడంటే విజయ్ దేవరకొండ పెద్ద స్టార్. అతణ్ని అనుసరించి తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తొలి అడుగులో తడబడి.. ఆ తర్వాత కాస్త పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చదువుకునే రోజుల్లో మాత్రం ఆనంద్‌దే పూర్తి పైచేయి అట. స్కూల్లో, ఇంట్లో అందరూ అతడికే ప్రయారిటీ ఇచ్చేవారట. పొగిడేవారట. అతణ్ని చూస్తే విజయ్‌కు మండిపోయేదట. ఈ విషయాన్ని తన తమ్ముడితో కలిసి పాల్గొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో విజయ్ వెల్లడించాడు.
విజయ్, ఆనంద్ పుట్టపర్తిలోని సత్య సాయిబాబా ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్లోనే కలిసి చదువుకున్నారు. చిన్నప్పట్నుంచి స్కూలింగ్ అయ్యేవరకు హాస్టల్లోనే ఉన్నారు. అప్పటి అనుభవాల గురించి ఈ ఇంటర్వ్యూలో విజయ్ గుర్తు చేసుకున్నాడు. తమ్ముడు తన కంటే చాలా మెరుగైన విద్యార్థి కావడం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డట్లు చెప్పుకొచ్చాడు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో విజయ్ ఏమన్నాడంటే..
“మేం స్కూల్లో ఉన్నపుడు ఆనంద్‌కు ప్రతి సబ్జెక్ట్ లో 100కు 100 మార్కులు వచ్చేవి. నాకు మాత్రం 85 వరకు మార్కులే వచ్చేవి. హాస్టల్‌లో ఆనంద్ సైలెంట్ కిడ్ అయితే నేను గ్యాంగులతో గొడవలు పడే టైపు. తమ్ముడిని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వెళ్లి గొడవపడేవాడిని. హాస్టల్ హెడ్ కూడా నన్ను చూసి భయపడేవాడు. స్కూల్లో, హాస్టల్లో ఆనంద్ అందరికీ ఫేవరెట్. అలాగే ఇంట్లో కూడా ఆనంద్‌నే ముద్దు చేసేవారు. నా ఆట బొమ్మలు కూడా తనకే ఇచ్చేసేవారు. క్రికెట్‌లో ఆనంద్ ఔట్ అయినా మళ్లీ బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చేవారు. ఇలా ప్రతి చోటా తమ్ముడికి ఇస్తున్న ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. దీంతో నాకు మండిపోయేది. ఐతే రాను రాను ఆనంద్‌కు క్రికెట్ మీద ఇష్టం పెరగడంతో చదువులో కొంచెం మార్కులు తగ్గడం మొదలయ్యాయి” అని విజయ్ గుర్తు చేసుకున్నాడు.
తాను సినిమా కెరీర్లో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో తమ్ముడికి యుఎస్‌లో జాబ్ వచ్చిందని.. అతడి వల్ల కుటుంబానికి ఆర్థిక భరోసా దక్కిందని.. తనకూ సపోర్ట్ వచ్చిందని.. అందువల్లే ఇండస్ట్రీలో కొనసాగగలిగానని విజయ్ వెల్లడించాడు.
This post was last modified on October 26, 2021 12:51 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…