రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా దాని వెనక ఓ పరమార్థం ఉంటుందని అంటారు. తమ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగానే మాట్లాడుతారు. అందుకే ఏవరైనా నాయకుడు ఏదైనా మాట్లాడితే దాని వెనక ఇంకేం అర్థం ఉందో అనే వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇక రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటి వ్యక్తి ఏవైనా వ్యాఖ్యలు చేశారంటే వాటి వెనక కచ్చితంగా వేరే అర్థాలు ఉంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని తనపై వత్తిడి వస్తుందని ఏపీలో ఉన్న తన అభిమానులు అలా కోరుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని అందుకే టీఆర్ఎస్ అక్కడ ఎన్నికల్లో బరిలో దిగితే గెలిపించుకుంటామని చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యల వెనక నిజానిజాలపై జోరుగా చర్చగా సాగుతోంది. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటని జనాలు ఆలోచిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీతో కేసీఆర్ సఖ్యతగానే ఉంటున్నారు. ఇటీవల జల వివాదం సంగతి పక్కనపెడితే అంతకు ముందు వరకూ బాగానే ఉన్నారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. జగన్‌ను తన ఇంటికి ఆహ్వానించారు.
ఇక ఏపీలో గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ పరోక్షంగా సాయం చేశారనే టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. జగన్ మీద కేసీఆర్‌కు మంచి అభిప్రాయమే ఉంది. అదే బాబు అయితే తెలంగాణతో వేలు పెడతారని ఆయన మీద కేసీఆర్‌కు ఆగ్రహం ఉంది. అందుకే జగన్‌ను కేసీఆర్ ఎప్పుడూ బహిరంగంగా విమర్శించలేదు. జగన్ కూడా తెలంగాణలో తన దుకాణం మూసేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలన్నది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే మరో వర్గం మాత్రం కేసీఆర్ దళిత బంధు పేరు చెప్పి దాన్ని జగన్ మెడకు చుట్టాలనే ఆలోచన చేశారని అభిప్రాయపడుతోంది. అలాంటిదేమీ లేదు ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్న సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని మరో వర్గం చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్.. జగన్‌ను దూరం చేసుకుని బాబును మాత్రం దగ్గరికి తీసుకోరు. ఈ నేపథ్యంలో జగన్‌కు మేలు చేసే విధంగానే కేసీఆర్ వ్యవహరిస్తారనే టాక్ ఉంది.
This post was last modified on October 26, 2021 1:04 pm
నేపాల్ వరదలు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలాది మంది పౌరులు, పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా…
కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఆమె కూతురు…
ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న తాప్సి కొన్నేళ్లుగా పూర్తిగా బాలీవుడ్ కే…
ఇంకో 22 రోజుల్లో ప్యారడైజ్ ఆగమనం జరగనుంది. వచ్చే వారం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టనుండగా తెలుగు రాష్ట్రాల్లో జీవోలు,…
అంతా అనుకున్నట్లే అయ్యింది. మొదట్నుంచి ప్రచారం జరుగుతున్నట్టే మంత్రి కొండా సురేఖ మీద వేటు పడింది. ఆమె రాజీనామా చేయడానికి…
30 ఏళ్లకుపైగా తాను నడిపిన బస్సుకు ఓ డ్రైవర్ భావోద్వేగ వీడ్కోలు పలికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.…