టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు.
రెండు రోజుల క్రితమే శంకర్ సినిమా షూటింగ్ మొదలైంది. పూణేలో ప్లాన్ చేసిన ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాస్ట్లీ సాంగ్ గా దీన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా అతడి సినిమాల్లో పాటలను చాలా లావిష్ గా చిత్రీకరిస్తుంటారు. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తుంటారు ఈ డైరెక్టర్.
ఇప్పుడు రామ్ చరణ్-కియారా అద్వానీ మీద యూనిక్ కాన్సెప్ట్ తో డ్యూయెట్ ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క పాటను 12 రోజులకు పైగా చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని విధంగా ఈ పాటను షూట్ చేస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు నిర్మాత దిల్ రాజు. అందుకే దర్శకుడు శంకర్ కి బడ్జెట్ విషయంలో ఎలాంటి షరతులు పెట్టడం లేదట. ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెబుతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
This post was last modified on October 25, 2021 1:44 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…