అప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాక 2021 అక్టోబరు 13ను కొత్త రిలీజ్ డేట్‌గా ఎంచుకుంది ‘ఆర్ఆర్ఆర్’ టీం. పక్కా ప్రణాళికలతోనే అడుగులేశారు కానీ.. కరోనా రెండో వేవ్ దెబ్బకు మరోసారి సినిమాను వాయిదా వేయక తప్పలేదు. మరి కొత్త రిలీజ్ డేట్ ఏదో అని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు, ఇండస్ట్రీ జనాలకు ఈ మధ్యే పెద్ద షాక్ ఇచ్చారు.
2022 జనవరి 7న తమ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా అయోమయమే. ఇండస్ట్రీ నుంచి పెద్దగా సానుకూల స్పందన లేదు. ప్రేక్షకుల్లోనూ ఒక రకమైన గందరగోళానికి కారణమైంది ఈ కొత్త డేట్. రాజమౌళిని ఎంతో గౌరవించే, అభిమానించే ఇండస్ట్రీ జనాలు ఆయన ఎంచుకున్న డేట్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పద్ధతి అని తప్పుబడుతున్నారు.
2022 సంక్రాంతికి చాలా ముందుగానే బెర్తులు ఖరారైపోయాయి. ఆల్రెడీ భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు వరుసగా జనవరి 12, 13, 14 తేదీలకు ఖరారయ్యాయి. ఆ మూడు చాలా పెద్ద స్థాయి సినిమాలు కావడంతో వాటికి థియేటర్లు సర్దుబాటు చేయడమే కష్టమవుతుంది. ఎంత సంక్రాంతి అయినా సరే.. రెండుకు మించి భారీ చిత్రాలను రిలీజ్ చేస్తే కష్టమవుతుంది. థియేటర్లు చాలినన్ని దొరకవు. ఈ విషయంలో గొడవలు జరుగుతాయి. వసూళ్ల మీదా ప్రభావం ఉంటుంది. వాటికి థియేటర్లు సర్దుబాటు ఎలానో అని టెన్షన్ పడుతుంటే.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి పడింది. ఇంకేదైనా సినిమా అయితే సర్దుకోవచ్చు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా ఊపు ఒక వీకెండ్‌కు పరిమితమవుతుందని అనుకోలేం. దాని థియేటర్లు తీసి వేరే వాటికి ఇవ్వడం అంత తేలిక కాదు.
అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’ అంచనాలకు తగ్గట్లు ఉంటే సంక్రాంతి సినిమాల కొంప కొల్లేరే. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాల్లో ఆందోళన తప్పట్లేదు. ఎవరికి వారు సంక్రాంతికే పక్కా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కంగారు పడుతున్న మాట మాత్రం వాస్తవం. ‘ఆర్ఆర్ఆర్’ డేట్ మారుస్తారేమో అన్న ఆశతో చూస్తున్నారు.
ఈ దిశగా సంక్రాంతి సినిమాల నిర్మాతలు ‘ఆర్ఆర్ఆర్’ టీం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ టీం మాత్రం సైలెంటుగా ఉంది. అలాగని రిలీజ్‌కు టైం తక్కువే ఉన్నా, పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్థాయిలో ప్రమోషన్లు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా కూడా ‘ఆర్ఆర్ఆర్’ అడుగులేమీ పడట్లేదు. మరి ఈ డేట్ విషయంలో పునరాలోచన ఏమైనా ఉందా.. లేక పక్కాగా ఆ డేట్‌కే సినిమాను తీసుకొస్తారా అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేస్తే బెటర్.
This post was last modified on October 21, 2021 10:39 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…