ఏదైనా పండక్కో లేక హీరో పుట్టినరోజుకో లుక్ కానీ, టీజర్ కానీ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేద్దామనుకుంటారు ఫిల్మ్ మేకర్స్. అప్పటివరకు అన్నింటినీ రహస్యంగా ఉంచుతారు. కానీ ‘సాలార్’ సినిమా విషయంలో ఆ సర్‌ప్రైజ్ మిస్సయ్యేలానే ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి అస్తమానం ఏదో ఒక విషయం లీకవుతూనే ఉంటోంది.
ప్రభాస్ హీరోగా ప్రెస్టీజియస్‌గా ‘సాలార్’ని తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏవో ఒక ఫొటోలు, వీడియోలు లీకవుతూనే ఉన్నాయి. దాంతో కాస్త కట్టుదిట్టంగా తీయాలని ప్లాన్ చేశాడు ప్రశాంత్. అయినా కూడా ఇప్పుడు మరో వీడియో లీకయ్యింది. ఇది ఓ ఫైట్ సీన్‌కి సంబంధించినది. తుపాకి పట్టుకుని ఎదురుగా ఉన్న శత్రువుల్ని కాల్చి పారేస్తున్నాడు ప్రభాస్. ఇందులో తన లుక్‌తో పాటు లొకేషన్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
నిజానికి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 23న టీజర్ రిలీజవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఇలా వీడియో లీకవడం అందరినీ షాక్‌కి గురి చేసింది. రీసెంట్‌గా ‘సర్కారువారి పాట’ టీజర్ కూడా ముందుగానే లీకైంది. ఆ తర్వాత ‘పుష్ప’ టీజర్ విషయంలోనూ అదే జరిగింది. దాంతో ఇండస్ట్రీకి ఈ వ్యవహారం పెద్ద సమస్యగా తయారయ్యింది. ఈ లీకు వీరుల ఆట ఎలా కట్టించాలా అని దర్శక నిర్మాతల వర్గం తలలు పట్టుకుంటోంది.
This post was last modified on October 20, 2021 11:49 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…