బాల నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసి.. తర్వాత బ్రేక్ తీసుకుని ఓ బేబీ మూవీలో క్యారెక్టర్ రోల్‌తో రీఎంట్రీ ఇచ్చాడు యువ నటుడు తేజ సజ్జా. ఈ సినిమాతో అతడికి మంచి పేరే వచ్చింది. తర్వాత అతణ్ని హీరోగా పెట్టి తన మిత్రుడు ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి మూవీ తీశాడు. అది డివైడ్ టాక్‌ను తట్టుకుని ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.
ఐతే ఆ సినిమా వల్ల తేజ ఇమేజ్ అయితే పెద్దగా మారలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ లాంటివేమీ ఏర్పడలేదు. అయినా సరే.. అతడికి ఆఫర్లయితే వస్తున్నాయి. ఇష్క్, అద్భుతం, హనుమాన్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఇందులో ఇష్క్ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజై అడ్రస్ లేకుండా పోయింది. చాలా తక్కువ బడ్జెట్లోనే తీసినప్పటికీ.. అది కూడా రికవర్ కాలేదు. థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపడా డబ్బులు కూడా రాలేదు ఈ సినిమా వల్ల. ఓటీటీ రిలీజ్ ద్వారా కొంత ఆదాయం వెనక్కి వచ్చినట్లుంది.
ఈ సినిమా అనుభవంతో తేజ తర్వాతి చిత్రం విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడ్డట్లున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు థియేటర్లలో బాగా ఆడి డబ్బులు రాబట్టడం అంత తేలిక కాదని అర్థం చేసుకుని.. తేజ కొత్త సినిమా అద్భుతంను ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం చేసేశారు. బాబు బాగా బిజీ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చత్రాన్ని చంద్రశేఖర్ మొగుల్ల నిర్మించాడు. రాజశేఖర్ పెద్దమ్మాయి శివాని రాజశేఖర్.. తేజకు జోడీగా నటించింది. ఆమెకు కథానాయికగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
This post was last modified on October 18, 2021 9:03 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…