ఒక స్టార్ హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి.. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర షోల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమా రిలీజ్ కాలేదంటే వాళ్ల ఆగ్రహం మామూలుగా ఉండదు. దీనికి ఎవరు బాధ్యులు అని చూడకుండా.. థియేటర్ల మీద పడిపోతారు. ఇలా పలు సందర్భాల్లో థియేటర్లు ధ్వంసమైన అనుభవాలున్నాయి. అందులోనూ మాస్‌లో మంచి ఫాలోయింగ్ హీరోల సినిమాల విషయంలో ఇలా జరక్కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
కానీ కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన సుదీప్.. తన కొత్త చిత్రం కోటిగొబ్బ-3 విషయంలో అలా జాగ్రత్త వహించలేకపోయాడు. ఈ సినిమాకు ఫైనాన్స్, ఇతర సమస్యల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ దాటి గురువారం విడుదలకు సిద్ధం చేశారు. తెల్లవారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జరిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా పడలేదు. మధ్యాహ్నానికి కూడా థియేటర్లు తెరుచుకోలేదు.
దీంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల దగ్గర సుదీప్ అభిమానులు గందరగోళం సృష్టించారు. చాలా చోట్ల థియేటర్ల మీద రాళ్లేశారు. స్టాఫ్ మీద దాడులకు దిగారు. దీంతో సుదీప్ రంగంలోకి దిగాడు. అభిమానులకు క్షమాపణ చెబుతూ.. కోటిగొబ్బ-3 గురువారం రిలీజ్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని.. శుక్రవారం కచ్చితంగా సినిమా రిలీజవుతుందని అతను క్లారిటీ ఇచ్చాడు.
అభిమానుల బాధను అర్థం చేసుకోగలనని.. ఐతే థియేటర్ల యాజమాన్యాలకు దీంతో ఏమాత్రం సంబంధం లేదని.. థియేటర్ల మీద దాడులకు పాల్పడ వద్దని అభిమానులకు సుదీప్ విన్నవించాడు. తన సినిమా విడుదల కోసం అభిమానుల్లాగే తానూ ఎదురు చూస్తున్నానని… ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటానని.. ఇంకొన్ని గంటలు ఎదురు చూడాలని అతను అభిమానులను కోరాడు. మరి శుక్రవారమైనా ఈ సినిమా సజావుగా రిలీజవుతుందేమో చూడాలి. ఈ చిత్రానికి సుదీపే కథ అందించగా.. శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా నటించింది.
This post was last modified on October 14, 2021 9:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…