మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తాలూకు రభస ఇప్పుడు కొంచెం సద్దుమణుగుతున్నట్లుగా ఉంది. రెండు రోజుల కిందట ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి మంచు విష్ణు ప్యానెల్, అలాగే మోహన్ బాబు మీద విమర్శలు, ఆరోపణలు చేశారు. దీనిపై ‘మా’తో ఇప్పుడు ఎలాంటి సంబంధం లేని నరేష్ స్పందించాడు కానీ.. మంచు విష్ణు, మోహన్ బాబు మాత్రం సైలెంటుగా ఉన్నారు. బుధవారం విష్ణు సైలెంటుగా ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలపై అతనెలా స్పందించబోయేది.. అధ్యక్షుడిగా వాటిపై ఏ నిర్ణయం తీసుకోబోయేది తెలియడం లేదు. దీనిపై అందరి దృష్టి నిలిచి ఉండగా.. విష్ణు తన తండ్రి మోహన్ బాబును వెంటబెట్టుకుని గురువారం నందమూరి బాలకృష్ణను కలవడం ఆసక్తి రేకెత్తించింది. ఆ కలయిక అనంతరం మోహన్ బాబు, విష్ణులిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్ బాబు బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య యన్.టి.రామారావు గారే నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశా. కానీ ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి గెలిపించారు. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు” అని మోహన్ బాబు అన్నారు.
ఇక విష్ణు మాట్లాడుతూ.. బాలయ్య తనకు మొదట్నుంచి ఎంతో మద్దతుగా నిలిచారని.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవడానికే కలిశానని చెప్పాడు. ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్నానని… ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నానని.. ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశానని.. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తానని విష్ణు చెప్పాడు.
This post was last modified on October 14, 2021 2:31 pm
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…