ఎన్నడూ లేనిది తమిళ హీరోలు ఒక్కొక్కరుగా తెలుగులోకి అడుగు పెట్టేస్తున్నారు. తమిళ స్టార్లు అనువాదాలతో మన ప్రేక్షకులను పలకరించడం కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడు మాత్రం నేరుగా తెలుగులో, తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తుండటమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా తమిళ టాప్ హీరో విజయ్ ఓ సినిమాకు కమిట్ కాగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాను ప్రకటించడం తెలిసిందే.
ఇప్పుడు శివ కార్తికేయన్ సైతం తాను టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు. ఈ యువ కథానాయకుడు తెలుగు సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి కానీ.. దానిపై అధికారిక సమాచారం ఏదీ లేదు. కానీ ఇప్పుడు స్వయంగా శివనే తన టాలీవుడ్ డెబ్యూ గురించి హింట్ ఇచ్చాడు.
తమిళంలో డాక్టర్ పేరుతో తెరకెక్కిన శివకార్తికేయన్ కొత్త చిత్రం వరుణ్ డాక్టర్‌గా తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన శివ.. మీడియాతో మాట్లాడాడు. అప్పుడు తెలుగులోకి అరంగేట్రం చేయడం గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై శివ మాట్లాడుతూ.. తాను త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నానని.. అందుకోసం తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పాడు. తాను చేయబోయే తెలుగు సినిమా గురించి దాని నిర్మాణ సంస్థే త్వరలో ప్రకటన చేస్తుందని కూడా శివ తెలిపాడు. కాబట్టి శివ తెలుగు డెబ్యూ కన్ఫమ్ అయినట్లే.
‘జాతిరత్నాలు’తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి ఘనవిజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అనుదీప్‌కీ, శివకార్తికేయన్‌కీ మధ్య కథా చర్చలు నడుస్తున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వీరి కలయికలో రాబోయే పాన్ ఇండియా సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించనున్నట్లు సమాచారం. లవ్ స్టోరీ తెరకెక్కిన ఇదే సంస్థలోనే ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా రూపొందనుంది.
This post was last modified on October 7, 2021 7:05 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…