Movie News

బాహుబ‌లి, పుష్ప బాట‌లో క‌మ‌ల్ సినిమా


బాహుబ‌లి సినిమాను ముందు ఒక చిత్రంగా తీయాల‌నే మొద‌లుపెట్టారు. కానీ మేకింగ్ మ‌ధ్య‌లో రాజ‌మౌళి ఆలోచ‌న మారింది. ఈ క‌థ ప‌రిధి పెద్ద‌ద‌ని.. బ‌డ్జెట్‌, మార్కెట్ లాంటి అంశాలను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ముందు ఈ నిర్ణ‌యం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని చాలామంది సందేహాలు వ్య‌క్తం చేశారు కానీ.. చివ‌రికి జ‌క్క‌న్న ప్లాన్ అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయింది. రెండు భాగాలూ అద్భుత విజ‌యాన్ని సాధించి సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

ఐతే బాహుబ‌లి లాంటి భారీ చిత్రాల‌ను అలా రెండు భాగాలు చేయ‌డం ఓకే కానీ.. ఈ మ‌ధ్య పుష్ప అనే రెగ్యుల‌ర్ మూవీని కూడా 2 పార్ట్స్‌గా తీయ‌డానికి సుకుమార్ సంక‌ల్పించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఈ సినిమాను సైతం ఒక చిత్రంగా తీయ‌డానికి సంక‌ల్పించారు. కానీ మేకింగ్ మ‌ధ్య‌లో ఆలోచ‌న మారిపోయింది. అది కూడా రెండు భాగాలైంది. ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌రు 17న‌ తొలి భాగాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇప్పుడు సౌత్‌లో మ‌రో క్రేజీ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ చిత్ర‌మే.. విక్ర‌మ్‌. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో యువ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ రూపొందిస్తున్న సినిమా ఇది. విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్ లాంటి విల‌క్ష‌ణ, మేటి న‌టులు ఇందులో విల‌న్లుగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఒక భాగంగా తీయాల‌నే మొద‌లుపెట్టారు. కానీ దీని ప‌రిధి కూడా ఎక్కువే కావ‌డం, ఫ‌స్ట్ పార్ట్ నిడివి దాదాపు నాలుగు గంట‌లు వ‌స్తుండ‌టంతో ఇప్పుడు చిత్ర బృందం ఆలోచ‌న‌లు మారుతున్న‌ట్లు స‌మాచారం. దీన్ని రెండు భాగాలుగా తీసి, రిలీజ్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన కంటెంట్ ఉంద‌ని.. అలా చేస్తే క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. దీనిపై లోకేష్‌, క‌మ‌ల్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే తుది నిర్ణ‌యం తీసుకుని.. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

This post was last modified on October 3, 2021 10:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago