Movie News

బన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమా?


టాలీవుడ్లో చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకునే కథానాయకుల్లో అల్లు అర్జున్ ఒకడు. తండ్రి అండ, ఆయన్నుంచి అందిపుచ్చుకున్న లక్షణాలు బన్నీకి ప్లస్ అనడంలో సందేహం లేదు. అందుకే టాలీవుడ్లో మరే స్టార్ హీరోకూ లేని సక్సెస్ రేట్ బన్నీకి ఉంది. ‘నా పేరు సూర్య’తో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్నాక బన్నీ ఎంత ఆచితూచి వ్యవహరించాడో.. తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడో తెలిసిందే.

ఇప్పుడు సుకుమార్‌తో అతను చేస్తున్న ‘పుష్ప’ కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలున్నాయి. దీని తర్వాత బన్నీ ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇది ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న సినిమా. ఒక దశలో ఇది రద్దవుతుందనే ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రచారానికి తెరదించుతూ బన్నీ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని తర్వాతి చిత్రానికి కూడా బన్నీ పచ్చ జెండా ఊపినట్లు తాజా సమాచారం.

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో అల్లు అర్జున్ జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. స్పైడర్, సర్కార్ దర్బార్ చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న మురుగదాస్‌కు కోలీవుడ్లో ఆశించిన అవకాశాలు లేవు. విజయ్‌తో అనుకున్న సినిమా అనూహ్యంగా క్యాన్సిల్ అయింది. తర్వాత మరే పెద్ద స్టార్ మురుగతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఈ స్థితిలో బన్నీ అతణ్ని నమ్మాడు. ఐతే స్క్రిప్టు విషయంలో మాత్రం బన్నీ అంత ఈజీగా ఓకే చెప్పడన్న సంగతి తెలిసిందే.

బన్నీ కోసం ఇంతకముందు మురుగదాస్ ఒకట్రెండు లైన్స్ చెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి ఇప్పుడు ఐకాన్ స్టార్ కోసం మురుగదాస్ ఒక సైన్స్ ఫిక్షన్ కథను చెప్పాడట. ‘సెవన్త్ సెన్స్’ తరహా కథ ఇదని.. ఐతే దానికంటే మెరుగ్గా స్క్రిప్టు రెడీ అవుతోందని.. లైన్ విని బన్నీ ఓకే చెప్పాడని.. ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో మురుగదాస్ ఉన్నాడని.. ఇంకో ఏడాది తర్వాత ఈ సినిమా పట్టాలెక్కతుందని.. ఇది పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు.

This post was last modified on October 3, 2021 5:33 pm

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

2 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

3 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

4 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

5 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

5 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

6 hours ago