ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అధ్యక్ష పదవికి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన సీవీఎల్ నరసింహారావు, జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేసిన బండ్ల గణేష్ ఒకరి తర్వాత ఒకరు పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ రెండు వర్గాల మధ్య కేంద్రీకృతం అయింది. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్.. ఇంకోవైపు మంచు విష్ణు బృందం బరిలో మిగిలాయి.
ఇప్పుడు ఇండస్ట్రీలోని నటీనటులు మెజారిటీ ఈ రెండు ప్యానెళ్లలో ఎవరి వైపు ఉన్నారన్నది తేలాల్సి ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకోవడం విశేషం. పవన్ కళ్యాణ్, జనసేన మద్దతుదారులంతా పరోక్షంగా ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మంచు విష్ణు ఫ్యామిలీకి వైకాపాతో ఉన్న కనెక్షన్, ఇటీవల జగన్‌కు మద్దతుగా విష్ణు వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ మద్దతుదారులు అతడి వైపు నిలిచే అవకాశముంది.
కాగా తెలుగుదేశం మద్దతుదారులు ఎవరి వైపు నిలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ విషయంలో మంచు విష్ణు ఎడ్జ్ తెచ్చుకున్నాడనే అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ మద్దతు అతను సంపాదించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు వారం ముంగిట బాలయ్యను కలిశాడు విష్ణు. మంచు హీరోకు బాలయ్య ఆల్ ద బెస్ట్ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
మంచు ఫ్యామిలీ రాజకీయ ఉద్దేశాలన్ని పక్కన పెడితే బాలయ్యతో వాళ్లకు ముందు నుంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సాన్నిహిత్యంతోనే వారి బేనర్లో ఒకప్పుడు ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’ అనే సినిమా చేశాడు బాలయ్య. చిరంజీవి పట్ల బాలయ్యకున్న వ్యతిరేకత దృష్ట్యా కూడా మంచు విష్ణుకు బాలయ్య మద్దతు ఇస్తుండొచ్చనిపిస్తోంది. అలాగని టీడీపీ మద్దతుదారులందరూ మంచు విష్ణుకు ఓటేస్తారని అనుకోలేం. జగన్ సర్కారు ఇండస్ట్రీని ఉద్దేశపూర్వంగా ఇబ్బంది పెడుతోందన్న అభిప్రాయం ఇక్కడి జనాల్లో బలంగా ఉన్న నేపథ్యంలో ఆ కోపంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ వైపు చాలామంది నిలిచే అవకాశాలు లేకపోలేదు. మరి వచ్చే ఆదివారం జరిగే ఎన్నికల్లో ‘మా’ సభ్యుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on October 3, 2021 2:52 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…