Movie News

‘కొండపొలం’ క్రెడిట్ పవన్ కల్యాణ్ ఖాతాలో వేసేశారుగా!

కొన్ని సినిమాలు నిర్మాణ దశ నుంచే క్రేజ్ తెచ్చేసుకుంటాయి. అందుకు భిన్నంగా మరికొన్ని సినిమాలు మాత్రం టీజర్.. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. అమాంతం వాటి మీద అందరి చూపు పడుతుంటుంది. ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది ‘కొండపొలం’ మూవీ. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించి.. కీరవాణి సంగీతంతో రూపుదిద్దుకున్న ఈ మూవీకి వైష్ణవ్ తేజ్.. రకుల్ ప్రీత్ సింగ్ అదనపు ఆకర్షణలుగా మారారు. నిజానికి ‘కొండపొలం’ పూర్తిగా డైరెక్టర్స్ ఫిలిం. సామాజిక అంశాల్ని తనదైన శైలిలో చర్చించే గుణం క్రిష్ లో కనిపిస్తూ ఉంటుంది. తాజా కొండపొలంలో అలాంటి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పక తప్పదు.

ఈ మూవీ ఆడియో వేడుక తాజాగా కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు క్రిష్.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పవన్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ మూవీ మధ్యలో కొండపొలం మూవీ మొదలైందని.. ఈ సినిమాను చేయటానికి అనుమతి ఇచ్చిన పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పటం విశేషం. ‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తర్వాత.. సినిమా రంగానికి చెందిన పలువురు.. ఆయన చేసిన వ్యాఖ్యలన్ని ఆయన వ్యక్తిగతమన్న రీతిలో రియాక్టు కావటం.. ఆయన ప్రస్తావన రాకుండా చూసుకోవటం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటివేళ.. ఈ వారం రిలీజ్ కానున్న కొండపొలం క్రెడిట్ పవన్ కు ఇచ్చేయటం గమనార్హం. సినిమాను మరో మెట్టు ఎక్కించిన క్రెడిట్ ను కీరవాణి ఖాతాలో వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చిత్ర దర్శకుడు.. సంగీత దర్శకులు ఇద్దరూ.. భారీ సినిమాల్ని చేస్తూ.. మధ్యలో ఈ సినిమాకు తమ సేవల్ని అందించటం గమనార్హం. క్రిష్ హరిహర వీరమల్లు చేస్తూ మధ్యలో దీన్ని చేస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించటం ద్వారా.. ఈ మూవీ మరో రేంజ్ కు వెళ్లిందని చెప్పక తప్పదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో ఈ వారాంతానికి తేలిపోనుంది.

This post was last modified on October 3, 2021 10:21 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

8 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago