భారీ సినిమాలు ప్లాన్ చేయడం ఈజీయే కానీ పూర్తి చేయడం మాత్రం అంత ఈజీ కాదు. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా మధ్యలో ఊహించని విపత్తులు వస్తే అడుగడుగునా ఆలస్యమే. అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’ విషయంలోనూ అది జరిగింది. కరోనా, లాక్‌డౌన్ కారణాలతో ఈ మూవీ లేటవుతూ వచ్చింది.
ఎట్టకేలకి 90 శాతం షూటింగ్ పూర్తయ్యాక క్రిస్మస్‌కి సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే మిగతా పార్ట్ తీస్తున్నప్పుడు భారీ వర్షాలతో మరోసారి అంతరాయం ఏర్పడింది. దాంతో అనుకున్న సమయానికి రావడం కష్టమేనంటూ ప్రచారం మొదలైంది. పైగా చిరంజీవి ‘ఆచార్య’ను కూడా అప్పటికే తీసుకు రావాలనుకుంటున్నారు కాబట్టి ఈ మూవీ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుంటోందనే గుసగుసలూ వినిపించాయి. కానీ అది నిజం కాదని, పుష్పరాజ్ డిసెంబర్‌లో రావడానికి ఫిక్సయ్యాడని తేల్చేశారు మేకర్స్.
‘పుష్ప’ చిత్రాన్ని డిసెంబర్ 17న ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. మొదట బన్నీ లుక్.. తర్వాత టీజర్.. ఆపైన పాట.. రీసెంట్‌గా రష్మిక పోస్టర్.. ఇలా ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలను పెంచుకుంటూ పోతున్నాడు సుకుమార్. ఆల్రెడీ ‘రంగస్థలం’తో తాను రా అండ్ రస్టిక్ ఫిల్మ్స్ ఎలా తీయగలనో చూపించి ఉన్నాడు కాబట్టి ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి.
బన్నీ స్మగ్లర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అతన్ని పట్టుకోవాలని చూసే ఫారెస్ట్ ఆఫీసర్‌గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. అది కూడా ఈ సినిమాకి అడిషనల్ క్రేజ్‌ని తీసుకొచ్చింది. పైగా బన్నీ చేస్తున్న ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కూడా కాబట్టి అంచనాలు ఆ రేంజ్‌లో ఉండటం కామనే!
This post was last modified on October 2, 2021 10:55 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…