అందరి చూపు.. కియారా వైపు

కొంతకాలంగా గమనిస్తే.. ఏ ప్యాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేసినా హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరే వినిపిస్తోంది. చివరికి ఎవరైనా ఖాయం కానివ్వండి.. మొదటగా మాత్రం ఆమె పేరు తెరమీదికి వచ్చేస్తుంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. అయితే ఈసారి నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న బైలింగ్వల్ మూవీలో ఫిమేల్‌ లీడ్‌గా కియారాని కన్‌ఫర్మ్ చేశారట. వినయ విధేయ రామ’ బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినా.. అంతకు ముందు చేసిన ‘భరత్‌ అనే నేను’ మాత్రం కియారా ఖాతాలో మంచి విజయాన్ని వేసింది. అందుకే ఆమెకి టాలీవుడ్‌లో క్రేజ్ ఉంది. కానీ బాలీవుడ్‌లో బిజీ అయిపోయి సౌత్ వైపు చూడటమే మానేసింది కియారా. ఎట్టకేలకి రామ్ చరణ్, శంకర్‌‌ల సినిమాతో ఇటు అడుగు వేసింది. ఆ పరిచయంతోనే దిల్‌ రాజు ఇప్పుడు విజయ్‌ సినిమా చేయడానికి కూడా ఆమెని ఒప్పించినట్టు తెలుస్తోంది.

విజయ్ ప్రస్తుతం చేస్తున్న ‘బీస్ట్’ షూటింగ్‌ పూర్తి కాగానే ఈ మూవీ సెట్స్కి వెళ్తుంది. ఈలోపు హీరోయిన్‌ని కన్‌ఫర్మ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ పూర్తయ్యాయట. కియారా కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యిందని, ఆమె దాదాపు ఖరారైనట్టేనని టాక్. ప్రస్తుతం హిందీలో భూల్ భులయ్యా 2, జుగ్‌ జుగ్ జియో, మిస్టర్ లేలే చిత్రాలు చేస్తోంది కియారా. వీటిలో ఒకటి ఆల్రెడీ పూర్తైపోయింది. మిగతావి కూడా చివరి దశకు చేరుకున్నాయి. కాబట్టి డేట్స్ సమస్య కూడా అంతగా లేకపోవచ్చు.