ప్రాడెక్ట్ ఏదైనా సరే.. దాని ఉత్పత్తిదారుడే ఎంత ధర ఉండాలన్నది నిర్ణయిస్తారు. కానీ తాము తీసే సినిమాలకు టికెట్ రేటు ఎంత ఉండాలన్నది తమ చేతుల్లో లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల లోలోన తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితితో పడిపోయామంటూ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గొడవ మొదలైంది ‘వకీల్ సాబ్’ సినిమాతో అన్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందెన్నడూ లేని విధంగా సరిగ్గా ఆ సినిమా రిలీజయ్యే టైంకే టికెట్ల ధరలకు సంబంధించి పాత జీవోలను బయటికి తీసి ఏపీ అంతటా థియేటర్ల మీద దాడులు జరపడం.. టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం తెలిసిందే. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా, కవర్ చేసే ప్రయత్నం చేసినా.. పవన్ లక్ష్యంగానే ఆ చర్యలు చేపట్టారన్న విషయం స్పష్టమైపోయింది.
ఇన్నాళ్లూ మౌనం వహించిన పవన్ కళ్యాణ్.. మొన్నటి ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఓపెన్ అయిపోయాడు. టికెట్ల ధరలు, ఇతర సమస్యల విషయంలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేశాడు. అప్పట్నుంచి సినీ పెద్దల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. దిల్ రాజు సహా కొందరు సినీ పెద్దల మనోగతాన్ని అర్థం చేసుకుని, వారి నిస్సహాయతను చూసే పవన్ గళం విప్పాడన్నది స్పష్టం. తన దగ్గరికి కొందరు నిర్మాతలు వచ్చి మొర పెట్టుకుంటే, దీని గురించి మాట్లాడమంటేనే తాను ఆ రోజు అలా మాట్లాడానని పవన్ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
నిర్మాతలు కోరుకున్నదే పవన్ చేసినా.. బహిరంగంగా అతడికి మద్దతు పలకలేని పరిస్థితి. పైగా పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇటు చిరంజీవి.. అటు మిగతా సినీ పెద్దలు పవన్ వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని, వాటికి తాము వ్యతిరేకం అని తనతో అన్నట్లుగా మంత్రి పేర్ని నాని ప్రెస్ ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దల ఆంతర్యం ఏమిటో అంతుబట్టకుండా ఉంది. వాళ్ల మనసుల్లో ఉన్నది ఒకటి.. బయటికి మాట్లాడుతున్నది ఒకటి.. వాళ్ల గురించి పవన్ చెప్పేదొకటి.. మంత్రి మాట్లాడేది మరొకటి.. మొత్తంగా ఈ వ్యవహారంలో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుండటంతో లోలోన నలిగిపోతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on September 30, 2021 2:46 pm
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……