ఇటీవల జరిగిన ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ ను, కొందరు మంత్రులను టార్గెట్ చేస్తూ పవన్ కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో వైకాపా నేతలు, ఫాలోవర్స్ పవన్ ను తప్పుబడుతూ తిడుతున్నారు. నటుడు పోసాని కృష్ణమురళి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ ను ప్రశ్నించారు. ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ తనను హింసిస్తున్నారని.. పవన్ ఒక సైకో అంటూ మరో ప్రెస్ మీట్ పెట్టారు.
గత రెండు రోజులుగా మీడియాలో ఎక్కడ చూసిన పోసాని, పవన్ ల గురించే కథనాలు వస్తున్నాయి. పవన్ ని విమర్శించే సమయంలో పోసాని హద్దులు దాటి కొన్ని దారుణమైన మాటలు అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అతడిపై దాడికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా.. కూడా మెగా ఫ్యామిలీ మాత్రం ఈ వివాదంపై స్పందించడంలేదు. మెగా ఫ్యామిలీలో ఉన్నంతమంది హీరోలు మరే ఫ్యామిలీలో లేరు. దాదాపు డజను మంది హీరోలున్నారు.
అందులో చాలా వరకు అందరూ పాపులర్ అనే చెప్పాలి. వారిలో ఒక్కరు కూడా ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడలేదు. పోసానిని తిట్టడం కానీ పవన్ ని సపోర్ట్ చేయడం కానీ చేయలేదు. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన నాగబాబు మాత్రం పోసానిని ఉద్దేశిస్తూ ఓ డైలాగ్ షేర్ చేశారు. ‘పోసాని గురించి ఒక్క మాట’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘సమరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణ ‘కుక్కపిల్ల మొరిగిందనుకో’ అనే డైలాగ్ చెప్పే సీన్ ఫొటోను పెట్టారు. ఈయన సమాధానం బట్టి చూస్తుంటే.. పోసానిని మెగాఫ్యామిలీ లైట్ తీసుకుందనే అనిపిస్తుంది.
This post was last modified on September 29, 2021 12:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…