7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అమ్మాయి సరయు. ఈ ఛానెల్లో ఆమె చేసే వీడియోల్లో బూతులు వింటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఈ వీడియోలు చూసిన అమ్మాయేంటి ఇలా బూతులు మాట్లాడ్డమేంటి అంటూ అభ్యంతరాలు చెప్పిన వాళ్లున్నారు. అలాగే ఆ వీడియోలను ఎంజాయ్ చేసిన వాళ్లూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఎలాగైతేనేం సరయు అయితే బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కూడా దక్కించుకుంది. కానీ అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేక వారం తిరిగేసరికే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడామె.. వరుసగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తోంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది సరయు.
తాను ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెప్పిన సరయు.. అతను డబ్బుల కోసం వేధించడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు సరయు చెప్పడం గమనార్హం. ”ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్‌లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నా కెరీర్‌ను కూడా పక్కన పెట్టాను. ఆ బంధంలో అతడికి నేనివ్వాల్సినదాంట్లో 100 పర్సెంట్ ఇచ్చేశాను. నేను వర్జిన్ కూడా కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం, కట్నం విషయంలో గొడవ తలెత్తి చివర్లో పెళ్లి ఆగిపోయింది.
ముందు 25 లక్షలు అడిగారు, తర్వాత అర కోటి అన్నారు. తర్వాత కోటి డిమాండ్ చేశారు. చివరికి సగం ఆస్తి అడిగారు. ఇప్పటి నుంచే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో, ఇంకెలా ఉంటారో అని భయమేసి ఆ పెళ్లి రద్దు చేసుకున్నాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతడి ముఖం మీదే చెప్పేశాను” అని సరయు తెలిపింది.
This post was last modified on September 28, 2021 7:03 am
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…