ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఖరారైంది. ఇప్పటికే మంత్రి వర్గంలో బెర్త్‌లను ఆశిస్తున్నవారి జాబితాతోపాటు.. పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల జాబితా కూడా సీఎం జగన్ చెంతకు చేరిందని.. దీనిపై కసరత్తు ప్రారంభించారని అంటున్నారు. ఈ క్రమంలో ఉభయ గోదావరుల్లో కీలకమైన పశ్చిమ గోదావరి నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి టీడీపీ కంచుకోట వంటి ఈ జిల్లాలో వైసీపీ జెండా ఎగరేయడంలో అనేక మంది నాయకులు కృషి చేశారు. ఎంతో కష్టపడ్డారు. జగన్ సునామీ కూడా వీరికి కలిసి వచ్చింది. దీంతో ఇక్కడి వారు చాలా మంది మంత్రి పదవుల రేసులో ముందున్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు.
వీరిలో ఆళ్లనాని( ఏలూరు), తానేటి వనిత(కొవ్వూరు), శ్రీరంగనాథరాజు(ఆచంట) ఉన్నారు. అందులోనూ.. క్లీన్ ఇమేజ్ ఉన్న ఆళ్లనాని కూడా ఉన్నారు. ఒకరకంగా చూసుకుంటే.. గత రెండేళ్లుగా ఆయన కరోనా ఎఫెక్ట్ తో మిగిలిన మంత్రుల కంటే కూడా ఎక్కువగానే పనిచేస్తున్నారు. అయినప్పటికీ.. 100 శాతం మార్పు తథ్యమని ప్రకటించిన నేపథ్యంలో ఆయనను కూడా తప్పించనున్నారు. ఈ క్రమంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి..? మళ్లీ ముగ్గురికి ఛాన్స్ ఇస్తారా? లేక ఇద్దరితో సరిపెడతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు పశ్చిమ నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. మరొక స్థానాన్ని కర్నూలుకు మారుస్తారని.. ఇక్కడ నుంచి ఎక్కువ సంఖ్యలో మంత్రులను తీసుకుంటారని అంటున్నారు.
అయితే.. పశ్చిమ నుంచి తీసుకునేవారు ఎవరు? అంటే.. ఒకటి ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా.. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు ఇస్తారని అంటున్నారు. గతంలోనే ఆయనకు ఇవ్వాల్సి ఉండగా.. శ్రీరంగనాథరాజును తీసుకున్న నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో ప్రసాదరాజుకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. సో.. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయింది. ఇక, మిగిలింది.. మరో ఛాన్స్ ఇది.. ఈ దఫా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే.. వైఎస్‌కు అంత్యంత విధేయుడిగా పేరున్న తెల్లం బాలరాజుకు కేటాయిస్తారనే ప్రచారం ఉంది.
ఈ ఇద్దరికీ ఖచ్చితంగా సీటు దక్కుతుందని అందరూ అంటుండడం విశేషం. ప్రస్తుతం ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఆమెను తప్పిస్తే.. ఈ కోటాలో విజయనగరం నుంచి పలువురు ఉన్నప్పటికీ బాలరాజు వైపు జగన్ మొగ్గు చూపుతారని అంటున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. సో.. ఈ ఇద్దరికీ దక్కే ఛాన్స్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on September 27, 2021 6:42 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…