యంగ్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు!

టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ప్రతి ఒక్కరూ రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. యంగ్ హీరో నాగశౌర్య ఏకంగా ఆరు సినిమాలను పట్టాలెక్కించారు. ఈ అరడజను ప్రాజెక్ట్స్ కూడా షూటింగ్ దశలో ఉంది. అందులో రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుండడం విశేషం.

లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య రూపొందించిన ‘వరుడు కావలెను’ సినిమాలో శౌర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు శౌర్య నటిస్తోన్న మరో సినిమా ‘లక్ష్య’ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

విలువిద్య నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ తో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా ‘వరుడు కావలెను’ విడుదలైన వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే నెల గ్యాప్ లో శౌర్య నటించిన రెండు సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయన్నమాట. ఆయన నటిస్తోన్న మిగిలిన సినిమాలను 2022లో విడుదల చేయనున్నారు.