సినిమా వేడుకకు వస్తున్నాడు కదా.. రాజకీయాల గురించి ఏం మాట్లాడతాడులే అనుకున్నారు జనాలు పవన్ కళ్యాణ్ విషయంలో. అసలు ఏపీలో టికెట్ల ధరలు, ఇతర సమస్యల గురించైనా పవన్ స్పందిస్తాడా లేదా అని సందేహించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.
థియేటర్ల సమస్యలే కాదు.. చాలా విషయాలపై సంచలన రీతిలో స్పందించి అందరినీ పవన్ ఆశ్చర్యానికి గురి చేశాడు ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో. సమకాలీన రాజకీయాల చుట్టూ తిరిగే సినిమా ‘రిపబ్లిక్’ కావడంతో.. ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వేదికగా చేసుకుని సమయోచితంగా సినీ పరిశ్రమ సమస్యలను ప్రస్తావిస్తూ.. ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజకీయాలను దుయ్యబడుతూ పేలిపోయే స్పీచ్ ఇచ్చాడు పవన్. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో మీడియా అతి స్పందనను తప్పుబడుతూ వాళ్లు ఫోకస్ చేయాల్సిన విషయాలంటూ వైసీపీ మీదికి దృష్టి మళ్లించాడు.
ఈ క్రమంలో వైఎస్ కుటుంబ రాజకీయ కేంద్రమైన పులివెందుల మీద పవన్ ఫోకస్ పడింది. అక్కడ వైఎస్ కుటుంబానికి చెందిన ఇడుపుల పాయలో పెద్ద నేలమాలిగ లాంటిది ఉందని.. దాని నిండా డబ్బుల కట్టలు ఉంటాయని తనకు పోలీస్ అధికారులు చెప్పగా విన్నానని పవన్ పేర్కొనడం గమనార్హం. మీడియా వాళ్లు తేజు యాక్సిడెంట్ గురించి కాకుండా ఇలాంటి విషయాలపై ఫోకస్ చేయాలని పవన్ పిలుపునిచ్చాడు.
అలాగే వైఎస్ జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారో దాని మీద దృష్టిపెట్టాలని కూడా పవన్ అన్నాడు. అలాగే 2019 ఎన్నికల ముంగిట సంచలనం రేపిన కోడి కత్తి కేసు వ్యవహారాన్ని కూడా పవన్ ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేతను కోడి కత్తితో పొడిచాడని.. దీని మీద అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా స్పందించారని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, విచారణ జరపాలని అన్నారని.. కానీ ఈ కేసు ఏమైందో తెలియదని.. దీని మీద మీడియా దృష్టిపెట్టాలని పవన్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on September 26, 2021 12:09 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…