ఒకప్పటితో పోలిస్తే తెలుగులో తమిళ హీరోల హవా బాగా తగ్గింది. గతంలో ఇక్కడ మంచి మార్కెట్ సంపాదించుకున్న తమిళ స్టార్లు చాలామంది ఈ మధ్య బాగా డౌన్ అయ్యారు. ఇలాంటి టైంలో మన వాళ్లకు పెద్దగా పరిచయం లేని ఓ యంగ్ తమిళ హీరో తెలుగు మార్కెట్ మీద కన్నేశాడు.
ఇప్పటికే రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శివ కార్తికేయన్.. ఇప్పుడు వరుణ్ డాక్టర్ అనే మూవీతో రాబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 9న ఈ చిత్రం తమిళంతో తెలుగులోనూ రిలీజ్ కానుంది.
తమిళంలో డాక్టర్ అనే టైటిల్ పెట్టిన చిత్ర బృందం.. తెలుగు వెర్షన్‌కు మాత్రం వరుణ్ డాక్టర్ అనే టైటిల్ ఖరారు చేసింది. ప్రస్తుతం విజయ్‌తో బీస్ట్ మూవీ చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. దీనికి ముందు అతను నయనతారతో కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల) అనే సూపర్ హిట్ మూవీ తీశాడు.
తాజాగా వరుణ్ డాక్టర్ ట్రైలర్ లాంచ్ చేశారు. టైటిల్లో డాక్టర్ అని ఉందంటే ఇదేదో హాస్పిటళ్లు, మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే సినిమా అనుకుంటాం. కానీ ట్రైలర్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది. నెల్సన్ తొలి సినిమా కొకో కోకిల తరహాలోనే ఇది కూడా కిడ్నాప్ చుట్టూ తిరిగే సినిమా కావడం విశేషం.
ఒక డాక్టర్.. ఒక ఫ్యామిలీ గ్రూప్ రెడీ చేసి వాళ్లతో కిడ్నాప్ చేయించడం.. ఆ గ్రూప్‌ను విలన్ బ్యాచ్ పట్టుకుంటే వాళ్ల వెనుక ఉన్నది హీరో అని తెలియడం.. ఇదంతా అతను ఒక కాజ్ కోసం చేస్తున్నట్లు బయటపడం.. ఈ నేపథ్యంలో నడిచే సినిమా వరుణ్ డాక్టర్. క్రైమ్ స్టోరీని కొంచెం థ్రిల్లింగ్‌గా, కొంచెం ఫన్నీగా నడిపే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు నెల్సన్.
విజువల్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచేలా ఉంది. ముందు ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. తర్వాత ఆ ఆలోచన మార్చుకుని థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. మరి ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on September 26, 2021 11:36 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…