దక్షిణాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ప్రదర్శించిన సినిమా ‘ఇండియన్-2’. రెండు దశాబ్దాల కిందట సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు/ఇండియన్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల కిందట దర్శకుడు శంకర్ ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడు అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. కమల్ హాసన్‌నే హీరోగా పెట్టి భారీ చిత్రాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఘనంగా ఈ సినిమాను మొదలుపెట్టారు. కానీ ఏ ముహూర్తాన సినిమాను ఆరంభించారో కానీ.. మొదట్నుంచి ఈ చిత్రానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.
రెండు మూడుసార్లు బ్రేకులు పడ్డాక సినిమాను పున:ప్రారంభించి జోరుగా షూటింగ్ చేస్తున్న సమయంలో చివరగా క్రేన్ ప్రమాదం వల్ల సినిమా ఆగిపోయింది. దాని చుట్టూ నెలకొన్న వివాదం, ఆ తర్వాత కరోనా ప్రభావం వల్ల సినిమా ఎంతకీ పున:ప్రారంభం కాలేదు.
ఈ సినిమా వివాదాల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తిరిగి సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కనిపించకపోవడంతో శంకర్.. రామ్ చరణ్ సినిమాలోకి వచ్చేశాడు. దాని చిత్రీకరణ కూడా మొదలైపోయింది. కమల్ ఏమో విక్రమ్ సినిమాలో బిజీ అయిపోయాడు. ఈ మధ్య కమల్ మీడియాతో మాట్లాడుతూ.. వివాదాలను పరిష్కరించి సినిమాను తిరిగి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తామన్నాడు. కానీ ఆ దిశగా అడుగులేమీ పడలేదు.
ఈలోపు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయినట్లుగా వార్తలొచ్చాయి. ఇది నిజమే అయితే ఆమె ఏడాదికి పైగానే షూటింగ్‌లకు దూరం కావచ్చు. బిడ్డ పుట్టాక కూడా కొంత కాలం ఆమె షూటింగ్‌లకు వచ్చే అవకాశం లేదు. ఆమె అందుబాటులోకి వచ్చేవరకు ‘ఇండియన్-2’ సినిమాను పున:ప్రారంభించడం కూడా కష్టమే. ఈలోపు కమల్, శంకర్ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసి, వేరే సినిమాల మీదికి వెళ్లొచ్చు. మరి అందరికీ డేట్లు కుదిరి సినిమా ఎప్పటికి పున:ప్రారంభం అవుతుందన్నది చెప్పడం కష్టమే.
This post was last modified on September 18, 2021 7:16 pm
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…