మొత్తానికి రేటింగ్స్ పడిపోయి కనుమరుగైపోయినట్లుగా కనిపించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోను జూనియర్ ఎన్టీఆర్ బాగానే నిలబెడుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులుగా పేరు మార్చుకుని స్టార్ మా నుంచి జెమిని టీవీలోకి వచ్చిన ఈ షోను తారక్ ఆరంభ ఎపిసోడ్ నుంచి విజయవంతంగా నడిపిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న దీని రేటింగ్సే తారక్ పనితనానికి నిదర్శనం. ఆరంభ ఎపిసోడ్లో రామ్ చరణ్‌తో సూపర్ హిట్ ఎపిసోడ్ తర్వాత తారక్.. మామూలు కంటెస్టెంట్లతోనే షోను బాగానే నడిపిస్తున్నాడు.
ఐతే ఎప్పుడూ సామాన్యులతోనే ఎపిసోడ్లను నడిపిస్తే బోర్ కొట్టక మానదు. ఆకర్షణ పెంచాలి. సెలబ్రెటీలను తీసుకురావాలి. ఈ దిశగా జెమిని టీవీ అదిరిపోయే ప్లానింగే చేసింది. ఈ సోమవారం ఇద్దరు టాప్ డైరెక్టర్లతో షో నడిపించబోతోంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, తారక్‌కు అత్యంత సన్నిహితులు అయిన రాజమౌళి, కొరటాల శివలు.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు విచ్చేశారు. ఇప్పటికే వీరితో షూట్ కూడా పూర్తయింది. ఈ నెల 20న, సోమవారం రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. తనకు ఆప్తులైన రాజమౌళి, శివలతో తారక్ బాగానే రచ్చ చేశాడని ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
వాళ్లు కంటెస్టెంట్ల సీట్లో కూర్చోగానే.. లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్ అంటూ ఆర్డర్లివ్వడం.. తారక్ షాకవ్వడం.. మధ్యలో వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని జవాబు చెప్పే ప్రయత్నం చేయగా.. ఇది రూల్స్‌కు విరుద్ధం అంటూ క్వశ్చన్ క్యాన్సిల్ చేయబోవడం.. చివర్లో ఈ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది, ఇక్కడ నేనే బాస్ అంటూ తారక్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం.. ఇలా ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇది చూస్తే ఈ షోకే ఆకర్షణగా నిలిచే బ్లాక్‌బస్టర్ ఎపిసోడ్ చూడబోతున్నామని స్పష్టమవుతోంది.
This post was last modified on September 17, 2021 10:31 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…