నాని నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే..!

Nani

నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన వస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం నాని ‘అంటే సుందరానికి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు.

వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ మీడియాతో మాట్లాడిన నాని.. తన తదుపరి సినిమా గురించి వెల్లడించారు. దసరా నాటికి తన కొత్త సినిమా అనౌన్స్ చేస్తానని అన్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి సినిమాను నిర్మించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ‘దసరా’ అనే టైటిల్ అనుకుంటున్నారట.

దాదాపు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని టాక్. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథగా సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో నాని కొత్త లుక్ తో కనిపించబోతున్నారు. దసరా రోజు టైటిల్ పోస్టర్ తో పాటు నాని లుక్ ను కూడా రివీల్ చేస్తారట. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేశారు. అలానే నటీనటులను, టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసుకున్నారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.