బ్రిటన్ కు ప్రభాస్ ప్రయాణం..?

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లుక్స్ విషయంలో బాగా ట్రోల్ చేశారు. అతడు బరువు పెరగడంతో నెటిజన్లు బాగా విమర్శించారు. ఇప్పుడు అదే ఎఫెక్ట్ ‘ఆదిపురుష్’ సినిమాపై పడుతోంది. దర్శకుడు ఓం రౌత్ రాముడి పాత్రలో ప్రభాస్ ను చూపించబోతున్నారు. దీనికోసం ప్రభాస్ తన ఫిజిక్ ను కంప్లీట్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్ దర్శకుడు అనుకున్న ఫిజిక్ ను సాధించలేకపోయారు. దీంతో అతడికి ఫుల్ బాడీ టెస్ట్ చేయాలని యూనిట్ నిర్ణయించిందట.

దీంతో దర్శకుడు ఓం రౌత్.. ప్రభాస్ ను తీసుకొని బ్రిటన్ వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. నిజానికి సినిమా అనుకున్న సమయానికి ప్రభాస్ లుక్ బాగానే ఉంది. కానీ ఇంతలో లాక్ డౌన్ పడడంతో.. ప్రభాస్ కాస్త లావెక్కరు. ఆ తరువాత ‘సలార్’ షూటింగ్ కోసం కాస్త బరువు తగ్గి ఇప్పుడు మళ్లీ బరువెక్కారు. ఇలా ప్రభాస్ తన బరువు విషయంలో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం ‘ఆదిపురుష్’ మేకర్లను టెన్షన్ పెడుతోంది. ఫిజిక్ లో తేడాలు వస్తే అవి సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

అందుకే బ్రిటన్ లో వరల్డ్ క్లాస్ డైటీషియన్ల ఆధ్వర్యంలో ప్రభాస్ కు పూర్తిస్థాయిలో బాడీ చెకప్ చేయించి.. అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దీనికోసం త్వరలోనే బ్రిటన్ కి వెళ్లబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఆయన చేతిలో ప్రస్తుతానికి మరో మూడు సినిమాలున్నాయి.