ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసిన స్టార్ హీరో!

కమర్షియల్ సినిమాల్లో మంచి మెసేజ్ లు ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు. ఆ రకమైన కథలనే ఎన్నుకుంటున్నారు. ముఖ్యంగా కొరటాల శివ సినిమాల కాన్సెప్ట్స్ అన్నీ అలానే ఉంటాయి. మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ అనే సినిమా తీశాడు కొరటాల శివ. అప్పటినుండి మహేష్ తన ప్రతీ సినిమాలో ఏదో రూపంలో సందేశం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు. ఆ పాయింట్ చుట్టూనే కథలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మహేష్ నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా ఇలాంటి పాయింట్స్ చాలానే ఉన్నాయట.

ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నాయి. క్లైమాక్స్ లో మహేష్ ఆర్థిక వ్యవస్థపై వేసే సెటైర్లు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. భారీ యాక్షన్ సీన్ తో పాటు మహేష్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయట. దాదాపు ఐదు నిమిషాల పాటు సుదీర్ఘమైన స్పీచ్ ఇస్తాడని.. ఇందులో రాజకీయ, ఆర్థిక రంగాలపై సెటైర్లు ఉంటాయని సమాచారం.

లక్షల కోట్లు అప్పు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా నుంచి.. అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే రైతుల వరకు ప్రతీ ఒక్కరినీ ప్రస్తావిస్తూ ఈ డైలాగ్స్ సాగుతాయని.. ఈ సన్నివేశాలే సినిమాకి మెయిన్ సోల్ అని తెలుస్తోంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటినుండే హైప్ ఓ రేంజ్ లో వస్తోంది. రీసెంట్ గా విడుదలైన సినిమా టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు.