Movie News

పవన్‌ వచ్చేలోపు.. ఒకటి కాదు రెండు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో ఎంత స్పీడుమీదున్నాడో తెలిసిందే. ఆల్రెడీ ‘వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ చేసిన పవన్.. ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటితో పాటు ఇంకో రెండు సినిమాలను ఏడాది కిందటే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి హరీష్ శంకర్ మూవీ కాగా.. ఇంకోటి సురేందర్ రెడ్డి చిత్రం. వీటిలో హరీష్ సినిమా దసరాకు సెట్స్ మీదికి వెళ్తుందంటున్నారు.

సురేందర్ చిత్రం మాత్రం ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా లేదు. కనీసం ఇంకో ఏడాదైనా టైం పట్టొచ్చని అంటున్నారు. ఈ ఆలస్యంపై ముందే అంచనా ఉండటంతో ఆల్రెడీ అక్కినేని అఖిల్‌తో ఏజెంట్ మూవీని లైన్లో పెట్టాడు సురేందర్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ ఏడాది చివర్లోపే ‘ఏజెంట్’ను పూర్తి చేయాలన్నది సురేందర్ ప్లాన్. ఐతే అది పూరయ్యాక కూడా చాలా రోజుల పాటు వేచి చూడక తప్పేలా లేదు.

దీంతో ఈ గ్యాప్‌లో ఇంకో సినిమాను కూడా సురేందర్ లాగించేయబోతున్నట్లుగా తాజాగా వార్తలొస్తున్నాయి. అతను యంగ్ హీరో నితిన్‌తో జట్టు కట్టబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ నితిన్.. వక్కంతం వంశీతో ఓ సినిమాను లైన్లో పెట్టాడు. అది పూర్తి చేశాక వక్కంతం కథతో సురేందర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడట. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌లోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇటీవలే నితిన్ సొంత బేనర్లో ‘మ్యాస్ట్రో’ మూవీ చేశాడు. అది ఈ నెల 17న హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా నితిన్‌కు మంచి లాభాలే అందించింది. దీంతో ఆ ఉత్సాహంలో సొంత బేనర్లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుపెట్టి నాలుగైదు నెలల్లో పూర్తి చేసి.. ఆ తర్వాత సురేందర్ పవన్ సినిమా మీదికి వెళ్లిపోతాడు. పవన్-సురేందర్ చిత్రం 2023లో రిలీజయ్యే అవకశముంది.

This post was last modified on September 4, 2021 4:32 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

8 minutes ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

51 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

1 hour ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

2 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

3 hours ago