పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పుడు మాట్లాడినా అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే మాటలే చెబుతుంటాడు. పవర్ వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆయన కెరీర్లో మరపురాని విజయాన్ని అందించి అభిమానులను మురిపించిన హరీష్.. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ పవన్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ముందు నుంచి చాలా ఊరిస్తూ వస్తున్నాడు హరీష్.
పవన్‌కు తాను ఒక వీరాభిమానిని అని.. ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో అలాగే పవన్‌ను తన కొత్త సినిమాలో చూపించబోతున్నానని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు హరీష్. తాజాగా గురువారం పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని పెట్టిన ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్న హరీష్.. తమ కలయికలో రానున్న సినిమా గురించి అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యే మాటలు చెప్పాడు.
ఒకప్పుడు ‘గబ్బర్ సింగ్’ చేస్తున్నపుడు అభిమానులు పవన్ ఈసారి పెద్ద హిట్టు కొట్టి తీరాలని చాలా బలంగా కోరుకున్నారని.. అన్నిటికంటే సంకల్ప బలం గొప్పది అన్న మాటను రుజువు చేస్తూ ఆ చిత్రం ఘనవిజయం సాధించిందని.. ఇప్పుడు కూడా తమ కలయికలో రానున్న సినిమా గురించి ఫ్యాన్స్ అంతే ఆశలతో, అంచనాలతో ఉన్నారని హరీష్ చెప్పాడు.
అభిమానులు ఎంత హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా సరే.. వాటిని అందుకునే దిశగా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తున్నానని హరీష్ చెప్పాడు. స్క్రిప్టు చాలా బాగా వచ్చిందన్న హరీష్.. ఈ సినిమా చూసి పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని థియేటర్ల నుంచి బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశాడు. సినిమా ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఎక్కువ విశేషాలు రివీల్ చేయకూడదని ఆగుతున్నామని.. అభిమానులతో పంచుకోవడానికి చాలా ఉందని.. స్టెప్ బై స్టెప్ ప్రమోషన్లు చేద్దామని ఆగుతున్నామని హరీష్ తెలిపాడు. పోస్టర్లో అన్నట్లుగానే ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండదని.. పవన్ వ్యక్తిగత ఇమేజిని కూడా దృష్టిలో ఉంచుకుని సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ సంకేతాలు ఇచ్చాడు.
This post was last modified on September 3, 2021 1:05 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…