ఆర్జీవీ చెంప చెల్లు


రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాడు. ఆ విషయాన్ని స్వయంగా తనే చెప్పుకుంటాడు. ఒక ఫిలిం మేకర్‌గా ఆయన స్థాయి ఎంత పడిపోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్లైమాక్స్ అని, థ్రిల్లర్ అని మరీ నాసిరకం సినిమాలేవో తీసి సొంత ఓటీటీల్లో రిలీజ్ చేసుకున్నాడు వర్మ. ఆయన సినిమాల పట్ల జనాలకు అసలేమాత్రం ఆసక్తి ఉండట్లేదు ఈ మధ్య. వాటికి కనీస స్పందన కూడా లేకపోవడంతో వర్మ రూటు మార్చాడు. ఈ మధ్య అందమైన అమ్మాయిలతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానాతో కలిసి జిమ్ వర్కవుట్లు చేస్తూ ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు వర్మ. అది యూట్యూబ్‌లో బాగానే క్లిక్ అయింది. భారీగా వ్యూస్ తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో కొత్త ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు వర్మ.

మరో బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డితో వర్మ కొత్త ఇంటర్వ్యూకు రెడీ అవడం విశేషం. దీని కోసం తనదైన శైలిలో ఒక ప్రోమో కూడా కట్ చేశాడు వర్మ. ఓ కాఫీ షాపులో పొట్టి డ్రెస్సులో కూర్చున్న ఆషు రెడ్డి దగ్గరికెళ్లి తనెవరో పరిచయం చేసుకోవడం.. తన డ్రెస్సు వంక అదోలా చూడటం.. మాటలు కలిపేందుకు ప్రయత్నించడం.. చివరగా నీ థైస్ (తొడలు) నాకు చాలా నచ్చాయని చెప్పడం.. ఆమె లాగి పెట్టి వర్మకు లెంపకాయ ఇవ్వడం.. ఇలా సాగింది ఆ ప్రోమో.

ఇదంతా పబ్లిసిటీ గిమ్మక్కే అయినప్పటికీ వర్మను ఓ అమ్మాయి చెంపదెబ్బ కొట్టడం అనే పాయింట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. వర్మ కోరుకున్నట్లే ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఫుల్ ఇంటర్వ్యూ కూడా వెంటనే యూట్యూబ్‌లోకి రాబోతోంది. మరి పూర్తి వీడియోలో వర్మ ఇంకెన్ని వేషాలేస్తాడో.. ఆషుతో కలిసి ఎన్ని విన్యాసాలు చేస్తాడో చూడాలి.