యువ నటుడు, బిగ్ బాస్ విన్నర్ మృతి..!

యువనటుడు, హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్ల మృతి చెందాడు. బిగ్ బాస్ -13 విజేతగా నిలిచిన… సిద్ధార్థ శుక్ల గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ముంబై లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే గుండెపోటుతో మృతి చెందాడు లేక మరేదైనా కారణమా ? అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ శుక్ల.. బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సిద్ధార్థ శుక్ల మృతి పట్ల చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రిందట సిద్ధార్థ్ తన ప్రియురాలు షెహనాజ్ గిల్‌తో కలిసి బిగ్ బాస్ ఓటీటీకి గెస్ట్‌గా వచ్చాడు. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా అతడి మరణవార్తను విని అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు సిద్ధార్థ్ శుక్లా. కాగా, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో అటు నార్త్.. ఇటు సౌత్‌ ప్రేక్షకులకు కూడా సిద్ధార్థ్ శుక్లా చేరువయ్యాడు.