ఉన్నట్లుండి సమంత వెర్సస్ పూజా హెగ్డే ఇష్యూ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వీళ్లిద్దరి మధ్య అసలు విభేదాలు పొడసూపుతాయని ఎవ్వరూ ఊహించలేదు. టీవీలో ‘మజిలీ’ సినిమా చూస్తూ సమంత ఏమంత అందంగా లేదంటూ పూజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కామెంట్ చేసిందన్నది ఆమె మీద వచ్చిన ఆరోపణ. ఐతే తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఇలా కామెంట్ పెట్టారని పూజా వివరణ ఇచ్చింది. ఆ పోస్టును డెలీట్ చేసింది. అంతటితో వ్యవహారం సద్దుమణిగిందనే అనుకున్నారంతా. కానీ ఇది హ్యాకర్ల పని కాదని.. పూజానే కామెంట్ పెట్టి విమర్శలు రావడంతో డెలీట్ చేసిందని సమంత ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఐతే ఈ ఇష్యూను సమంత, ఆమె సన్నిహితులు సీరియస్‌గా తీసుకుని కౌంటర్లు వేస్తుండటంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది.
సమంత.. ఆమె స్నేహితురాళ్లయిన దర్శకురాలు నందిని రెడ్డి, గాయని చిన్మయి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. వీళ్ల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణల తాలూకు స్క్రీన్ షాట్లు ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. వాళ్లు పూజా మీద ముగ్గురూ పరోక్షంగా కౌంటర్లు వేశారు. ముందుగా నందిని రెడ్డి.. ‘వాట్ ద హ్యాక్.. లవ్ యు టూ’ అంటూ సమంతనుద్దేశించి ట్వీట్ వేసింది. ఇక్కడ హ్యాక్ అనే పదం వాడటం పూజాకు కౌంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తర్వాత చిన్మయి లైన్లోకి వచ్చి.. ‘‘ప్లీస్ లవ్ మి టూ.. ఐయామ్ నీడీ.. పి.ఎస్: మై అకౌంట్ ఈజ్ నాట్ హ్యాక్డ్’ అంటూ మెసేజ్ పెట్టింది.
చివర్లో సమంత.. ‘‘జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్’’ అంటూ పంచ్ వేసింది. వీళ్లు ముగ్గురూ ఇంకొన్ని మెసేజ్‌లు కూడా పెట్టారు. అన్నింట్లోనూ పూజా ‘హ్యాకింగ్’ స్టేట్మెంట్ మీద కౌంటర్లు ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్లందరూ పూజా కావాలనే పోస్టు పెట్టిందని భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తెలుగులో పూజా ఫస్ట్ రిలీజ్ ‘ఒక లైలా కోసం’లో చైతూ హీరో కాగా.. అఖిల్ కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఆమే కథానాయిక అనే విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
This post was last modified on May 29, 2020 2:10 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…