సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకడు. ఏదో సినిమా కబుర్లు చెప్పి ఊరుకోకుండా చాలా స్వేచ్ఛగా తన భావాలు వెల్లడిస్తుంటాడు రాహుల్. చాలా మంది సినిమా వాళ్లు సోషల్ మీడియాలో రాజకీయాలు, వివాదాస్పద అంశాల జోలికి అస్సలు వెళ్లరు కానీ.. రాహుల్ చాలా దూకుడుగా వివిధ అంశాల మీద కామెంట్లు కూడా చేస్తుంటాడు.
సినిమాల విషయంలోనూ టెంప్లేంట్ స్టయిల్లో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కామెంట్లు, పోస్టులు పెడుతుంటాడు. ఈ క్రమంలోనే తాను ప్రధాన పాత్ర పోషించిన ‘నెట్’ వెబ్ ఫిలిం గురించి రాహుల్ ఒక కామెంట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ‘‘మా సినిమాకి గు..లో దమ్ముంది’’ అని రాహుల్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు చాలామంది విమర్శలు గుప్పించారు.
ట్విట్టర్లో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయాలని.. యూత్‌ను ప్రభావితం చేసే రాహుల్ లాంటి వాళ్లు ఇలా బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టించుకూడదని కామెంట్లు చేశారు. నెటిజన్లు ఓ రేంజిలో తనపై ఎటాక్ చేయడంతో రాహుల్ స్పందించాడు. అతనేమీ ట్వీట్ డెలీట్ చేయలేదు. తన కామెంట్ పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తనపై విమర్శలు చేసిన వాళ్లకు చురుక్కుమనేలా ఇంకో ట్వీట్ వేశాడు. ‘‘అంటే ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట’’ అని అతను కామెంట్ చేయడం విశేషం.
రాహుల్ దమ్మున్న కామెంట్ పెట్టాడని ప్రశంసలు కురిపిస్తే.. మళ్లీ అతణ్ని ఎటాక్ చేసే వాళ్లు తమ శైలిలోనే కామెంట్లు పెట్టారు. ఐతే ఈ కామెంట్‌తో ‘నెట్’కు రావాల్సిన పబ్లిసిటీ అయితే వచ్చేసింది. మా సినిమా బాగుంటుంది చూడండి.. అంటే ఈ రోజుల్లో జనాలు ఏం పట్టించుకుంటారు? ఇలా ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తే ఒక డిస్కషన్ ఉంటుంది. సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. ఆ విషయంలో రాహుల్ విజయవంతం అయినట్లే.
This post was last modified on August 30, 2021 6:05 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…