మెగాస్టార్ చిరంజీవి అంటే అసలు ఇష్టపడని వేరే హీరోల అభిమానులు కూడా ఆంతరంగిక సంభాషణల్లో ఆయన గొప్పదనాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగిన తీరు అలాంటిది. ఆ కష్టం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
సినిమా వాళ్లనే కాదు.. మామూలు జనాలను కూడా ఇన్‌స్పైర్ చేసింది. అందుకే చిరు గొప్పదనాన్ని ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఇండస్ట్రీలో మెగా హీరోలకు, నందమూరి హీరోలకు పైకి చెప్పుకోని ఒక వైరం ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీరి అభిమానులైతే బయట, సోషల్ మీడియాలో మామూలుగా కొట్టుకోరు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన గొప్ప మాటలు ఇప్పుడందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి.
రామ్ చరణ్ అతిథిగా హాజరైన ఎవరు మీలో కోటీశ్వరులు అరంగేట్ర ఎపిసోడ్‌లో హోస్ట్ తారక్.. చిరంజీవి గురించి ఒక మంచి కామెంట్ చేశాడు. చిరంజీవి ఇంట్లో తమకు ఒక ఆచార్య లాంటి వాడే అంటూ ఆయన తమనెలా తీర్చిదిద్దాడో చరణ్ వివరించగా.. చిరంజీవి గారు మీకు ఇంట్లో ఆచార్య అయితే.. బయట మాకందరికీ ఆచార్య అని తారక్ పేర్కొనడం విశేషం.
మరోవైపు పవన్ కళ్యాణ్‌తో అనుబంధం గురించి చరణ్‌ను తారక్ ప్రశ్నించగా.. చిన్నతనం నుంచి తన తండ్రి బిజీగా ఉండటంతో ఆయన ఏం చెప్పాలనుకున్నా అవన్నీ బాబాయి ద్వారా చెప్పించేవారని.. ఆయన తండ్రి తర్వాత తండ్రిలా, అన్నయ్యలా తమను చూసుకున్నారని చరణ్ అన్నాడు. ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని తాను ఆ దేవుణ్ని ప్రార్థిస్తానని తారక్ అన్నాడు.
This post was last modified on August 23, 2021 10:43 am
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.…
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా అంటే వాతావరణం అలాగే కనిపిస్తుంది. ఇప్పటి…
చెప్పిన డేటుకి షూటింగ్ పూర్తి చేయరు. రిలీజ్ డేట్ మళ్లీ మళ్లీ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్ డేట్ దగ్గర…
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషుల జీవితాలు సులభతరం కావాలి. కానీ కొన్ని సంస్థల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.…
దేశంలో మొదటిసారి హైదరాబాద్ లో శనివారం గిగ్ వర్కర్ల సంక్షేమ సభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ…
హిందూ సంస్కృతి, పురాణాలు, దేవుళ్ల నేపథ్యంలో సినిమాలు తీస్తే తమిళ ప్రేక్షకులకు పెద్దగా పట్టదు అనే ఒక ముద్ర పడిపోయింది.…