లాక్ డౌన్ టైంలో తెలుగులో ఎక్కువగా చర్చల్లో ఉన్న తెలుగు సినిమాల్లో నిశ్శబ్దం ఒకటి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తాడు నా రాజు ఫేమ్ హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఇక అప్పట్నుంచి చిత్ర బృందం ఏమీ చేయలేక సైలెంటుగా ఉంది. వాళ్లు చేయడానికి చిన్నా చితకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏమీ మిగల్లేదు.
ఐతే థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాంలో నేరుగా రిలీజ్ చేసేస్తారని గట్టి ప్రచారమే సాగింది. అదేం లేదంటూ చిత్ర సమర్పుకుడు కోన వెంకట్ ఒకటికి రెండుసార్లు స్పష్టత ఇచ్చినా ప్రచారం ఆగలేదు.
ఐతే నిశ్శబ్దంకు సంబంధించి తాజాగా వచ్చిన అప్ డేట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ పని పూర్తయింది. ఈ థ్రిల్లర్ మూవీకి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఇటీవల ఏర్పాట్లు జరిగాయి. చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఒకేసారి తర్వాత అందరూ మీద పడతారన్న ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించినట్లున్నారు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుని మామూలుగా సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుందో తెలియకపోయినా.. నిశ్శబ్దం టీం మాత్రం త్వరపడి సెన్సార్ చేయించేసింది. ఆన్ లైన్ రిలీజ్‌కు అయితే సెన్సార్ సర్టిఫికేషన్ కూడా అవసరం లేదు. తమ సినిమా నేరుగా థియేటర్లలోకే వస్తుందనే సంకేతాలు ఇవ్వడానికి కూడా చిత్ర బృందం ఈ పని పూర్తి చేసి ఉండొచ్చేమో.
This post was last modified on May 27, 2020 9:11 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…