గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించింది సునీత. కెరీర్ తొలి నాళ్లలోనే ఆమె పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కూడా కంది. కానీ భర్తతో విభేదాలు వచ్చి 15 ఏళ్ల కిందటే అతణ్నుంచి విడిపోయింది. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటోంది. మధ్యలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి రకరకాల రూమర్లు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని తర్వాత తేలింది. ఐతే మధ్య వయసులోకి వచ్చాక సునీత ఒక తోడును వెతుక్కోవడం, మీడియా ఇండస్ట్రీలో ఉన్న రామ్‌ను పెళ్లాడటం అందరిలో ఆసక్తి రేకత్తించింది. ఈ పెళ్లి గురించి సునీత పెద్దగా మీడియా ముందు ఓపెన్ అయింది లేదు. మీడియా వాళ్లకు ఆమె అవకాశమే ఇవ్వలేదు.
ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించిన సునీత.. తన పెళ్లి గురించి కూడా ఓపెన్ అయింది. రామ్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నది.. ఆయన తనను ఎలా అప్రోచ్ అయింది.. తమ పెళ్లి గురించి బయటి వాళ్లు ఏం మాట్లాడుకున్నది వివరించింది.
“రామ్ చాలా మంచి వ్యక్తి. పెళ్లి ప్రపోజల్‌తో నా వద్దకు వచ్చినప్పడు ఒకటే చెప్పారు. ‘నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే బాధపడతాను.. కానీ నా లైఫ్ మాత్రం ఎక్కడ ఆగదు’ అని చెప్పాడు. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చింది. అందుకే ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా. ఐతే నా పెళ్లి గురించి చాలా మంది ఆడవాళ్లే తప్పుగా మాట్లాడుకున్నారు. ముందు నుంచి నా బాధ్యతలన్ని ఎవరో వ్యక్తి చూసుకుంటున్నారని కామెంట్లు కూడా చేశారు. డబ్బు కోసమే రామ్‌ని పెళ్లి చేసుకున్నానన్నారు. ఆయనకు ఎంత ఆస్తి ఉందనే విషయం నాకు ఇప్పటికీ తెలియదు. ఆయన కంపెనీ టర్నోవర్ ఎంతో ఐడియా లేదు. నేను సొంత కాళ్లపై నిలబడి బతుకుతున్న దాన్ని. ఆయన వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరిపై ఒకరికి పరస్పరం గౌరవం ఉంది” అని సునీత వివరించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates