తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన నటుల్లో ఆర్య ఒకడు. కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆర్య మన ప్రేక్షకులకు బాగానే పరిచయం. తెలుగులో అల్లు అర్జున్ సినిమా ‘వరుడు’ విలన్ క్యారెక్టర్ కూడా చేయడం తెలిసిందే. ఈ మధ్యనే అతను ‘సార్పట్ట’ అనే సినిమాతో పెద్ద హిట్టు కొట్టాడు. ఐతే ఈ సంతోషంలో ఉన్న ఆర్య.. ఒక వివాదంలో చిక్కకుని పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ శ్రీలంకకు చెందిన ఓ యువతి కేసు పెట్టడం గమనార్హం. ఇదేమీ అల్లాటప్పా కేసులాగా కనిపించడం లేదు. ఈ కేసు విచారణలో భాగంగా ఆర్య.. తాజాగా చెన్నై సిటీ కమిషనర్ కార్యాలయంలో విచారణకు కూడా హాజరయ్యాడు. అంత పెద్ద స్టార్ మీద ఎవరో విదేశీ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని కేసు పెట్టడమేంటో.. ఈ కేసులో ఆర్య విచారణకు కూడా హాజరు కావడం ఏంటో అర్థం కాక తమిళ జనాలు తలలు పట్టుకుంటున్నారు.
కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం శ్రీలంకకు చెందిన విద్జా అనే అమ్మాయి జర్మనీలో ఉంటోంది. తనను ఆర్య పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఆన్ లైన్ ద్వారా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్యతో చేసిన చాటింగ్‌ను స్ర్కీన్‌షాట్‌గా తీసి విడుదల చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి జర్మనీ నుంచి చెన్నై పోలీసులకు సమాచారం రావడంతో ఆర్యను చెన్నై కమిషనర్ కార్యాలయానికి పిలిచి మూడు గంటల సేపు పోలీసులు విచారించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఐతే ఆర్య పేరుతో ఇంకెవరో విద్జాను మోసం చేసి ఉంటాడని.. కోట్ల పారితోషకం తీసుకుంటూ, కోలీవుడ్లో ఒక స్థాయిలో ఉన్న ఆర్య.. పెళ్లి పేరుతో ఓ విదేశీ అమ్మాయి నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటని అంటున్నారు నెటిజన్లు. ఆర్యకు హీరోయిన్ సాయేషాతో పెళ్లి కూడా అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 11, 2021 5:49 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…