పవన్ కళ్యాణ్ తో లెక్కలేమీ మాట్లాడలేదట!

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ త్వరలోనే మళ్ళీ మొదలు అవుతుందని వార్తలు వస్తున్నాయి. కొందరు జులై నుంచి షూట్ అంటే, కొందరు ఆగష్టు అంటూ ఊహాగానాలు సాగిస్తున్నారు. దిల్ రాజు మాత్రం దసరా రిలీజ్ దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక వేసుకుంటున్నాడని కచ్చితమైన సమాచారం. ఇదిలా ఉంటె ప్రస్తుత పరిస్థితులలో హీరోలు, దర్శకులు పారితోషికం తగ్గించుకోవాలనే ప్రతిపాదన ఉంది.

వకీల్ సాబ్ విషయానికే వస్తే ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ వేసుకున్నారు. కానీ అది జరగలేదు కనుక రాబడి విషయంలో మార్పులు వస్తాయి. అలాగే బయ్యర్స్ నుంచి కూడా తక్కువ ఆఫర్స్ వస్తాయి. అందుకే పవన్ పారితోషికం తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ దిల్ రాజు అయితే ఇంత వరకు ఆ విషయం గురించి పవన్ తో ప్రస్తావించలేదట. జులై నుంచి షూటింగ్ ఉంటుందని మాత్రం సూచన ప్రాయంగా చెప్పాడట.