పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ ఇలా ఆమె కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నా కూడా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. కాస్త బొద్దుగా ఉండడంతో సరైన అవకాశాలు కూడా రాలేదు. అయితే రీసెంట్ గా బరువు తగ్గి సన్నగా తయారైంది. ఎంగేజ్మెంట్ చేసుకున్న తరువాత పెళ్లి బ్రేక్ చేసుకున్నారు. అనంతరం ఆమె సినిమాలపై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ తో ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమాలో నటించింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మెహ్రీన్ మరో సినిమా సైన్ చేసినట్లు సమాచారం. తెలుగులో ‘జీనియస్’, ‘నువ్విలా’ వంటి సినిమాల్లో నటించిన హవీష్ కోనేరు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కార్తీక్ రెడ్డి డైరెక్ట్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను తీసుకున్నారట.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఫ్రెష్ కాంబినేషన్ ఉంటే మంచిదని మెహ్రీన్ ను తీసుకొచ్చారు. మిడ్ రేంజ్ హీరోలతో కలిసి పని చేసిన మెహ్రీన్ ఇప్పుడు చిన్న హీరోల సినిమాలు ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఉంటారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on August 4, 2021 7:22 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…