మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాలు వస్తున్నాయంటే.. చూడడానికి తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఓటీటీల కారణంగా ఫహద్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ కారణంగానే ‘పుష్ప’ లాంటి సినిమాలో ఆయన్ను విలన్ గా ఎంపిక చేసుకున్నారు. ఫహద్ ఫాజిల్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. రీసెంట్ గా ఈ మలయాళ స్టార్ నటించిన ‘మాలిక్’ అనే సినిమా విడుదలైంది.
థియేటర్లు మూతపడిన కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను నేరుగా విడుదల చేశారు. మత ఘర్షణలు, ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఆడే ఆటలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించారు. ఇందులో సులేమాన్ అలీ పాత్రలో ఫహద్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వృద్ధుడి గెటప్ లో ఫహద్ ఫాజిల్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై హీరో రానా కన్ను పడిందని సమాచారం.
ఇటీవల ఈ సినిమా చూసిన రానా.. తెలుగులో అయితే ఈ సబ్జెక్ట్ ను ఇంకా బాగా చేయొచ్చని అనుకున్నారట. దీంతో రీమేక్ హక్కులు కొని పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారట. పైగా ఇది తనకు సూటయ్యే కథ అని రానా భావిస్తున్నారట. నిజంగానే రానా బాడీ లాంగ్వేజ్ కి ఇది సూటయ్యే స్టోరీ. ప్రస్తుతం అయితే ఈ హీరో.. పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నాడు. మరి ‘మాలిక్’ రీమేక్ ఎప్పటికి ప్లాన్ చేస్తారో చూడాలి!
Gulte Telugu Telugu Political and Movie News Updates