ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాట విడుదలకు సమయం దగ్గర పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దోస్తీ పేరుతో ఈ పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషలకు చెందిన ఐదుగురు టాప్ సింగర్స్ పాడటం విశేషం. టాలీవుడ్ సింగర్ హేమచంద్రతో పాటు అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది, యాసిన్ నజీర్, విజయ్ ఏసుదాస్ ఈ పాటలో భాగమయ్యారు. ఈ పాటపై ఇప్పటికే ఉన్న అంచనాలను దర్శకుడు రాజమౌళి ఇంకా పెంచేశాడు.
సినిమా కథను ప్రతిబింబించేలా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా ఈ పాటను రాశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాటలో ఉంటుందని జక్కన్న చెప్పడం విశేషం.
ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ అగ్గికి ప్రతిబింబంలాంటి పాత్రను పోషిస్తుండగా.. నీటిని ప్రతిరూపం లాంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. పరస్పర విరుద్ధమైన ఈ పాత్రలు ఒక్కటైతే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో చాటిచెప్పేలా దోస్తీ పాట ఉంటుందని.. ఆ భావాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా తన సాహిత్యంతో వర్ణించారని రాజమౌళి తెలిపాడు.
తారక్, చరణ్ పాత్రల గురించి జక్కన్న వివరించిన తీరు.. ఈ పాట సాహిత్యం గురించి చెప్పిన వైనం చూస్తే సినిమాలో ఇది మేజర్ హైలైట్‌గా నిలిచే అవకాశముంది. ఈ పాట చిత్రీకరణ గురించి కూడా ఇండస్ట్రీలో పెద్ద టాకే నడుస్తోంది. ఈ సాంగ్ ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉంటుందని.. దీని మేకింగ్ కూడా ఓ రేంజిలో ఉంటుందని.. థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయమని అంటున్నారు.
This post was last modified on August 1, 2021 5:46 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…