ఉన్నట్లుండి ఈ మధ్య తమిళ కథానాయకుల మనసు తెలుగు సినిమాల వైపు మళ్లుతోంది. డబ్బింగ్ సినిమాలను ప్రమోట్ చేసి తెలుగులో రిలీజ్ చేసుకోవడం వేరు. కానీ నేరుగా తెలుగు చిత్రాలు చేయడం వేరు. ఒకప్పుడు కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి హీరోలు తెలుగులో నేరుగా సినిమాలు చేశారు కానీ.. తర్వాత ఈ ట్రెడిషన్ మరుగున పడిపోయింది. ఐతే విజయ్, ధనుష్ లాంటి హీరోలు ఇప్పుడు నేరుగా తెలుగు చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు.
వీరిలో ధనుష్ తెలుగులో చేయబోయే సినిమా ఇప్పటికే ఖరారైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సినిమాస్ వాళ్లు ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఐతే ధనుష్ మరో తెలుగు చిత్రం కూడా చేయనున్నాడని.. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరగడం తెలిసిందే.
ఈ వార్త నిజమే అనడానికి తాజాగా ఓ రుజువు దొరికింది. ధనుష్-వెంకీ కలయికలో సినిమాను నిర్మించనున్నట్లు చెప్పుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్.. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి అతడికి శుభాకాంక్షలు చెప్పింది. ధనుష్ టక్ చేసుకుని ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్న ఒక రేర్ స్టిల్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. బహుశా తమ బేనర్లో ధనుష్ చేయనున్న సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ లేదంటే డిస్కషన్ల సమయంలో తీసిన ఫొటో కావచ్చు.
మునుపెన్నడూ లేని విధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ ధనుష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిందంటే కచ్చితంగా అతడితో సినిమా చేయబోతున్నట్లే. వెంకీ చివరి సినిమా ‘రంగ్ దె’ను నిర్మించింది ఈ సంస్థే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ధనుష్-వెంకీ-సితార కలయికలో సినిమా ఖాయం అనుకోవచ్చు. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయనున్న సినిమాకు సంబంధించి ప్రి లుక్‌తో అతడికి విషెస్ చెప్పగా.. తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా ఈ రోజే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘మారన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
This post was last modified on July 28, 2021 3:10 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…