భర్తతో రిలేషన్ పై ప్రియమణి రెస్పాన్స్!

ప్రముఖ నటి ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాహం చెల్లదని.. ఆయన మొదటి భార్య అయేషా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్తాఫా ఇప్పటికీ తన భర్తే అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని స్పష్టం చేసింది. నేషనల్ మీడియాతో మాట్లాడిన ప్రియమణి తన వివాహంపై వస్తోన్న రూమర్లను ఖండించింది.

ముస్తఫా లాంటి భర్త దొరకడం తన అదృష్టమని చెప్పింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని.. అయినప్పటికీ రోజూ ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకుంటామని చెప్పింది. ఎక్కడ ఉన్నా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైందని చెప్పుకొచ్చింది. తన భర్తతో రిలేషన్ గురించి చెబుతూ.. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పింది. కొంతమంది తమ బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. అలాంటివేవీ పెట్టుకోవద్దని చెప్పింది. తామిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటామని.. ఏ బంధానికైనా అది చాలా అవసరమని చెప్పుకొచ్చింది.

ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకుంది. అయితే అంతకంటే ముందే 2010లో ముస్తఫా.. అయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు. అప్పటినుండి విడిగానే ఉంటున్నారు. ఆ తరువాత ముస్తఫా.. ప్రియమణిని పెళ్లి చేసుకున్నారు. కానీ తన పిల్లల కోసం ప్రతి నెలా డబ్బు పంపిస్తున్నాడు ముస్తఫా.