నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి చాలా కాలమవుతుంది. నిజానికి సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు సినిమాను రెడీ చేసుకొని మంచి తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసింది. సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ కి అమ్మడంతో సినిమా థియేటర్లోనే విడుదల అవుతుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు అడ్డుపడేలా మరో పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో థియేటర్లు తీర్చుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చినా.. టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ రాకపోవడంతో థియేటర్లను క్లోజ్ చేసే ఉంచారు. రీసెంట్ గా ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఓనర్స్ అసోసియేన్ సంస్థ ఒక స్టేట్మెంట్ ను పాస్ చేసింది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో విధించిన షరతులను ఎత్తేస్తేనే తప్ప థియేటర్లను తెరవకూడదని నిర్ణయించారు. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా దాదాపు అన్ని జిల్లాలకు చెందిన థియేటర్ యాజమాన్యాలు ఇలానే ఆలోచిస్తున్నాయి.
ఈ విషయంలో గనుక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇప్పట్లో సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్న ‘టక్ జగదీష్’ సినిమాకి ఇదొక అడ్డంకిగా మారింది. ఇదే గనుక కంటిన్యూ అయితే ఎక్కువ రోజులు సినిమాను ల్యాబ్ లో ఉంచే సాహసం చేయరు. ఇక ఆప్షన్ లేనప్పుడు ఇక సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం తప్ప ఇంకేం చేయలేరు. దీంతో మేకర్స్ స్ట్రీమింగ్ కంపెనీలతో చర్చలు మొదలుపెట్టారని సమాచారం. మరి నాని సినిమా ఓటీటీలోకి వస్తుందో.. థియేటర్ లోకి వస్తుందో చూడాలి!
This post was last modified on July 21, 2021 2:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…