శంకర్-చరణ్ సినిమా కోసం తమన్!

ఈ మధ్యకాలంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ సినిమాలన్నింటికీ తమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆయన చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేస్తోన్న చరణ్ త్వరలోనే శంకర్ సినిమాను మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాకి ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయనున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ సినిమాలో తమన్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించారు. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేష చేసింది. తమన్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

ఇప్పుడు ఏకంగా శంకర్ సినిమాకి మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేశాడు తమన్. రీసెంట్ గా శంకర్ తో కలిసి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను టెస్ట్ చేశాడు తమన్. అలానే కొందరు ఫోక్ సింగర్స్ ను సంప్రదించారు. త్వరలోనే తమన్ పేరుని శంకర్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. గతంలో శంకర్ ఏఆర్ రెహ్మాన్, హారీస్ జయరాజ్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేశారు. రీసెంట్ గా ‘ఇండియన్ 2’ సినిమాకి అనిరుద్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారు. ఇప్పుడు తమన్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పని చేయనున్నారు.